తెలంగాణలో బీసీల రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో బంద్ జరుగుతోంది అనిపించారు. అయితే ఈ బంద్ అంతా రాజకీయ నేతల హడావుడిలోనే కనిపిస్తోంది. ఆ హడావుడిలోనూ ఎవరి అజెండా వారు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలపైనా ఇతర పార్టీల నేతలు కామెంట్లు చేయడం ఇక్కడ స్పెషాలిటీ.
వివాదాల్లో ఇరుక్కున్న కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లను మంత్రి పదవుల నుంచి తప్పిస్తే తాము ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. మొత్తం బీసీ వర్గాలకు ఆ ఇద్దరు మంత్రుల్ని ఆయన ప్రతినిధుల్ని చేసేశారమో కానీ ఈ ప్రకటన కాస్త విచిత్రంగా ఉందని బీజేపీలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. అయినా కొండా సురేఖ, పొన్నంలను తప్పించినా .. సామాజిక సమీకరణాలను చూసుకుని మరో బీసీ నేతలకే అవకాశం కల్పిస్తారు. అప్పుడు వారు బీసీ కాకుండా పోతారా?
బీసీ రిజర్వేషన్ల రాజకీయాలను మెల్లగా రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈటల రాజేందర్ కూడా తన వంతు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. ఆటల రాజేందర్ భార్య రెడ్డి సామాజికవర్గం కావడంతో.. తన పిల్లలకు రెడ్డి అని పేర్లు పెట్టారు. కానీ ఆయన బీసీ రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.