ప్రమోద్ అనే కానిస్టేబుల్ ను నడిరోడ్డు మీద చంపేసి.. మరో కానిస్టేబుల్ గాయపరిచి పారిపోయి ఎన్ కౌంటర్ లో చనిపోయిన రియాజ్ కోసం కొంత మంది హక్కుల సంస్థల పేరుతో ఫ్యాక్ట్ ఫైడింగ్ పేరుతో బయలుదేరారు. రియాజ్ పై నలభై కేసులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. బుల్లెట్లు కనబడితే కొట్టుకెళ్తాడని రికార్డులు ఉన్నాయి. అయితే ఆయన రికవరీ ఏజెంట్ అని కొత్త సంఘాలు వాదనలు ప్రారంభించాయి.
రియాజ్ .. కానిస్టేబుల్ ప్రమోద్ చంపుతూండగా ఎవరూ చూడలేదని అంటున్నారు. మరి కానిస్టేబుల్ ను ఎవరు చంపారంటే దానికి సమాధానం లేదు కానీ.. రియాజ్ మాత్రం కాదంటున్నారు. మరి ఎందుకు చంపుతారని వేస్తున్న ప్రశ్నలకు .. కొత్తగా ఫేక్ నోట్ల ధీయరీని.. ప్రారంభించారు. పోలీసులకూ అందులో భాగం ఉందని..బయటకు రాకుండా ఎన్ కౌంటర్ చేశారని చెబుతున్నారు. వారి కథల సంగతేమో కానీ.. ఘోరమైన రౌడీ షీటర్ కూ సానుభూతి, మద్దతు చూపించడానికి మన సమాజంలో చాలా మంది తీరికగా ఉంటారని అర్థం అవుతోంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాకు చెందిన కొంత మంది పోలీసులు తప్పు చేశారని అన్యాయంగా ఎన్ కౌంటర్ చేశారన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. ముస్లింలను రెచ్చగొట్టేందుకు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కారణంగా ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని .. కాంగ్రెస్ నాయకుల అనుమానిస్తున్నారు. అయితే రియాజ్ లాంటి వాళ్లకూ సపోర్టుగా వస్తే.. అలాంటి నేరస్తులకు మరింత ధైర్యం పెరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
