జగన్మోహన్ రెడ్డి కూటమి రాజకీయాలు, పొత్తులకు వ్యతిరేకం. తనకు ఎవరూ అవసరం లేదని.. తానే అత్యంత శక్తివంతుడినని ఆయన నమ్మకం. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నమ్మకాల్ని వదలక తప్పదని అంటున్నారు. ఎన్డీఏ కూటమి తరహాలో కంగ్రెస్ లేకుండా ఆయన ఓ కూటమిని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. అదే నిజం అయితే ఆ కూటమిలో ఏ పార్టీలు ఉంటాయన్న చర్చ ప్రారంభమయింది. నిజానికి ఈ కూటమి గురించి మొదటగా మాట్లాడింది జడశ్రవణ్. కానీ వైసీపీ నుంచి స్పందనలేదు.
ఉన్నాయో లేవో తెలినీ పార్టీలతో కూటమి
వైసీపీ కూటమి కట్టబోయే పార్టీలు అంటూ కొన్నింటి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లాయర్ జడ శ్రవణ్ పెట్టినజై భీమ్ పార్టీ, అలాగే ఆమె ఆద్మీ పార్టీ, ఇంకా బహుజనసమాజ్ పార్టీ, వామపక్షాలు..వీటితో కలిపి కూటమిపై పోరాడేందుకు ఓ కూటమిని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. నిజానికిఈ ఐదు పార్టీల ఉనికి ఏపీలో ప్రశ్నార్థకంగా మారింది. స్వయంగా జడ శ్రవణ్ పోటీ చేస్తే 70 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయలేకపోయింది. బీఎస్పీ బీఫాంలు అమ్ముకోవడానికి పనికి వస్తుంది. కమ్యూనిస్టుల్లో ఒకరు జగన్ కు దూరంగా ఉంటారు. మరొకరు పొత్తుకు అంగీకరిస్తారా అన్నది సమస్యే.
ఓ కూటమిగా కనబడితేనే కాస్త బలం అనుకుటున్న జగన్
జగన్ ఒంటరిగా ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయని కొన్ని పార్టీల కూటమిగా ఏర్పడితే రాష్ట్రంలో బలం లేకపోయినా కేంద్రంలో …ఢిల్లీలో ఆయా పార్టీలు తనకు మద్దతుగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు. బీఎస్పీ, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీతో టైఅప్ కు జగన్ సుముఖంగా ఉండటానికి ఇది కూడా కారణం అని చెబుతున్నారు. కానీ వైసీపీ ఇంత వరకూ కూటమి గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ వైసీపీ సానుభూతి పరులుగా పేరు పడిన కొంత మంది ఇదే అంశంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.
పోరాటంలోనే కూటమి ..సీట్లలో కాదు !
జగన్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటంటే ఆయన ఇతరులను పావులుగా చేసుకుని రాజకీయ యుద్ధం చేస్తారు. కానీ ఎప్పుడూ వారికి క్రెడిట్ ఇవ్వరు. ప్రతిఫలం కూడా ఇవ్వరు. సీపీఎం గతంలోవైసీపీతో సన్నిహితంగా ఉంది. కానీ సీట్లివ్వడానికి ఆయన సిద్ధం కాలేదు. అలాగే జడ శ్రవణ్ లకైనా.. బీఎస్పీకైనా ఆయన పోరాటాలకే వాడుకుంటారు కానీ సీట్లివ్వరు. అది మాత్రం వంద శాతం నిజం.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              