మొంథా తుఫాన్ వచ్చింది. పోయింది. అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కానీ జగన్ తన పని తాను చేయలేదు. ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. టైమింగ్ మిస్సయితే కామెడీ అవుతుందని ఆయన టీమ్ ఆయనకు చెప్పలేదు. చెప్పినా వినిపించుకోరు. ఇప్పుడు బయలుదేరారు. ఆయన షెడ్యూల్ ప్రకారం ప్రతి మంగళవారం వస్తారు.. శుక్రవారం వెళ్తారు. ఆ ప్రకారం ఇవాళ బెంగళూరు నుంచి వచ్చి పెడనకు వెళ్లి పొలాలను పరిశీలిస్తారు. తర్వాత తాను ఎప్పుడూ చెప్పే స్క్రిప్ట్ ను మరోసారి చదువుతారు.
బురదలోకి దిగేలా ప్లాన్ చేసిన స్ట్రాటజిస్టులు
నిజానికి తుపాను ముగిసిన రెండు రోజుల తర్వాత ఏమీ ఉండదు. తుపాను ధాటికి పంటల నష్టం జరిగినా వాటిని అక్కడే ఉంచరు. కానీ జగన్ రెడ్డి స్కిట్ కోసం ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన బురదలోకి కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి స్కిట్లు వేసేవారు. బురదలోకి దిగి.. సెక్యూరిటీ గార్డును ఒంగోపెట్టి ఆయన పై చేయి పెట్టి మాట్లాడేవారు. సీఎం అయిన తర్వాత స్టేజ్ ఏర్పాటు చేసుకుని పంట నష్టాలను పరిశీలించడం ప్రారంభించారు. హోదా పెరిగింది కాబట్టి ఆయన మారిపోయారు. ఇప్పుడు హోదా పోయింది. అందుకే మళ్లీ బురదలోకి దిగిపోయేందుకు రెడీ అవుతున్నారు.
డ్రామాలని అందరికీ తెలిసేలా చేయడమే వైసీపీ స్పెషాలిటీ
వైసీపీ స్ట్రాటజిస్టుల అతి తెలివి తేటలకు.. జగన్ రెడ్డి కేటాయించే రెండు, మూడు రోజులకు పొంతన కుదరడం లేదు. ఏం చేసినా మొక్కుబడిగా జరిగిపోతోంది. ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం లేదు. పెద్ద ఎత్తున సోల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి.. ఏదో ఒకటి ఎలివేషన్లు ఇచ్చుకోవడం.. కులఘర్షణలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం మాత్రమే చేస్తున్నారు. ప్రజల్లోకి వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. అంతా సెటప్ ప్రకారం చేసేసుకుంటున్నారు.
నిజాయితీ పాలిటిక్స్ చేస్తేనే ప్రజలు గుర్తిస్తారు !
జగన్ నిజాయితీగా రాజకీయాలు చేస్తే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తాను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నానని నమ్మించడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే..ఆయన చేసిన పనులు.. నిర్వాకాలు అలా ఉన్నాయి. ఇప్పటికైనా ఆయన పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. తాను నిజాయితీగా ఉంటే.. కార్యకర్తలు కూడా నిజాయితీగా ఉంటారు. కానీ జగన్ డిక్షనరీలో ఉండని ఒకే ఒక్క పదం.. నిజాయితీ. అందుకే ఆయన రాజకీయాలు ఫేక్ అనే ఎక్కువ మంది నమ్ముతారు.
