రామ్ చరణ్ “పెద్ది” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కి సిద్ధమవుతోంది. ఫస్ట్ సింగిల్ టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. ఈ పాట “చికిరి” అనే హుక్ లైన్‌తో వుంటుంది. ఈ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో రెహ్మాన్ కూడా కనిపించబోతున్నారు. ఈ పాట కోసం రెహమాన్ చేసిన ఎంపిక మాత్రం విశేషంగా ఉంది. చికిరి పాటకి సింగర్ గా మోహిత్ చౌహాన్‌ను తీసుకున్నారు.
మోహిత్ హిందీ మ్యూజిక్ లో చాలా పాపులర్. ముఖ్యంగా “రాక్ స్టార్” సినిమాతో ఆయన పేరుమారుమ్రోగిపోయింది. ఆ సినిమాలో మొత్తం 15 పాటల్లో తొమ్మిది పాటలు మోహిత్ తో పాడించారు రెహ్మాన్. అవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. రాక్ స్టార్ ఆల్బమ్ రెహమాన్ కెరీర్లో ఎవర్గ్రీన్.
అయితే మోహిత్ తెలుగులో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ పాటలు పాడలేదు. ఆయన వాయిస్ టెక్స్చర్, టోన్ చాలా డిఫరెంట్. తెలుగు సంగీత దర్శకులు ఆయనతో ఎక్కువగా పని చేయలేదు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం ఆయనపై ఉన్న ప్రత్యేకమైన ఇష్టంతో “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాలో “ఇదేరా” అనే పాట పాడించారు.
ఆ తర్వాత డబ్బింగ్ రూపంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ఆయన వాయిస్ వినిపించినా, స్ట్రైట్‌గా తెలుగులో పెద్ద పాటలు పాడిన సందర్భాలు లేవు. ఇప్పుడు “పెద్ది”లాంటి పెద్ద సినిమాకి మోహిత్ చౌహాన్‌ను తీసుకొచ్చారు రెహమాన్. మొహిత్ వాయిస్ ఈ పాటకు ఒక కొత్త ఫీల్, ఫ్రెష్‌నెస్ ఇవ్వడం ఖాయం.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              