నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీ–రిలీజ్ కానుంది. రీ–రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌కి ముందు చిరంజీవి, రాజమౌళి, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి ప్రముఖుల బైట్స్‌ను జత చేశారు.
మెయిన్ ట్రైలర్ విషయానికి వస్తే.. పాత సినిమాకి విజువల్‌గా కొత్తదనం తీసుకురాలేము. కానీ 4K లాంటి ఆధునిక టెక్నాలజీలో రీస్టోర్ చేయడం వల్ల ఫ్రేమ్ క్వాలిటీ బెటర్ అవుతుంది. శివ రీ–రిలీజ్ ట్రైలర్లో కూడా ఆ 4K క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఒరిజినల్ ఫిల్మ్‌లో షూట్ చేసిన విజువల్ లో ఒక డెప్త్ వుంటుంది. కన్వర్ట్ చేసి రీస్టోర్ చేసే క్రమంలో కొన్ని ఫ్రేమ్స్‌లో లాస్ అయినట్లు కనిపిస్తోంది. ఈ తేడా థియేటర్స్‌లో చూసినప్పుడు మరింత క్లియర్ గా తెలుస్తుంది.
పాత సినిమాకి విజువల్‌గా మార్పులు సాధ్యంకాకపోయినా, సౌండ్‌ని మాత్రం కొత్తగా డిజైన్ చేయవచ్చు. ఈ రీ–రిలీజ్ కోసం శివ సినిమాకు డాల్బీ ఆట్మాస్ సౌండ్ డిజైన్ చేశారు. ట్రైలర్లో సౌండ్ క్లియర్‌గా, డైనమిక్‌గా వినిపిస్తోంది. దీని కోసం ఆర్జీవీ తన టీమ్‌తో కలిసి దాదాపు ఆరు నెలలు వర్క్ చేసినట్లు సమాచారం. ఆయన చేసిన సౌండ్ రీ–డిజైన్ ఎఫెక్ట్ థియేటర్స్‌లోనే తెలుస్తుంది. నవంబర్ 14న శివ మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది.
