విశాఖ గరం ‘స్కైస్క్రాపర్ సిటీ’గా మారుతోంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాభై అంతస్తుల వరకూ భవనాలకు అనుమతులు ఇస్తోంది. నలుమూలలా 25 నుంచి 50 అంతస్తుల వరకు ఉన్న హై-రైజ్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మధురావాడ, యెండాడ, సిరిపురం ృ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. 2025లో ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులు 2026-28 మధ్య పూర్తి కావచ్చని అంచనా.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎమ్ఆర్డీఏ) జూలై 2025లో 50 అంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్స్‌కు అనుమతి ఇచ్చింది. మధురవాడలోని సర్వే నంబర్ 331/1లో 4.07 ఎకరాల్లో ఆరు 50 అంతస్తులు రెసిడెన్షియల్ టవర్లు నిర్మిస్తున్నారు. 3బీహెచ్‌కే, 4బీహెచ్‌కే, 4బీహెచ్‌కే డూప్లెక్స్ అపార్ట్మెంట్లు అందుబాటులో ఉంటాయి. క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, పూల్ డెక్, జాగింగ్ & సైక్లింగ్ ట్రాక్‌లు, చైల్డ్రన్ ప్లే ఏరియాలు వంటి ప్రీమియం అమెనిటీలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా ఇది నిలవనుంది.
విశాఖలోని ప్రముఖ డెవలపర్లు కూడా 25+ అంతస్తుల హై-రైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఆరేడు ప్రాజెక్టులు వరకూ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి కలిపి విశాఖ స్కైలైన్‌ను మార్చేసి మధ్యతరగతి, హై-ఎండ్ కుటుంబాలకు ఆకర్షణీయ ఆప్షన్లుగా మారతాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ ప్రాజెక్టులు నగరాన్ని హై-డెన్సిటీ అర్బన్ హబ్‌గా మలుస్తాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో విశాఖపట్నం హైదరాబాద్, చెన్నై వంటి మెగా సిటీలతో పోటీ పడుతుంది. ఐటీ కారిడార్, బీచ్‌ల సమీపంలో ఉండటం ఆకర్షణ పెంచుతోంది.
