మహిళల వన్డే ప్రపంచ కప్ గెలుపు అందరికీ మంచి జోష్ ఇచ్చింది. ఈ విజయం అనుష్క శర్మ ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ సినిమాలో కదలికలు తెచ్చింది. మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా అనుష్క శర్మ టైటిల్ రోల్లో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రానికి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించగా, కర్నేష్ శర్మ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఏడేళ్ల క్రితం పూర్తయినా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఏవో బడ్జెట్ కి సంబధించిన లావాదేవీల్లో వివాదాలు వున్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై బజ్ వచ్చింది.
ఝులన్ గోస్వామి మహిళా క్రికెట్‌కి గణనీయమైన సేవలు అందించారు. తన బౌలింగ్‌తో ఎన్నో విజయాలు సమకూర్చారు. ఇండియా ప్రపంచ కప్ గెలిచిన క్షణాల్లో మైదానంలో చాలా ఎమోషనల్ అయ్యారు.ఈ నేపధ్యంలో సినిమా విడుదల కావాలని సోషల్ మీడియాలో డిమాండ్ పెరుగుతోంది. నిర్మాతలు కూడా ఈ బజ్‌ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో చిత్రబృందం చర్చలు జరిపింది. అనుష్క శర్మ క్రేజ్ ఉన్న స్టారే. విరాట్ రూపంలో తనకి క్రికెట్ నేపథ్యం కూడా ఉంది. అలాగే ఆమె సినిమా వచ్చి చాలా కాలమైంది. ఈ సినిమాను నేరుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు మేకర్స్.
