తెలుగు మీడియా ప్రముఖుల్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఎవరు వైరల్ అవుతున్నారంటే.. మూర్తి కాదు.. వెంకటకృష్ణ కాదు సాక్షి ఈశ్వ ర్ కాదు.. ఓన్లీ సాంబశివరావు. సాంబ అని ముద్దుగా పిలుచుకుని మరీ వైరల్ చేసుకుంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆయన మాటలు అంత కామెడీగా ఉంటున్నాయి. సాంబశివరావు చేసే కామెంట్లు అతి అనే దానికి చిన్న మాట. రోజూ నవ్వుల పాలవుతున్న ఆ అతి మాత్రం పెరుగుతూనే ఉంది. కొంత మంది టీడీపీ సానుభూతిపరులు కూడా.. ఎవరన్నా ఆయన్ని కంట్రోల్ చేయండయ్యా అని బతిమాలుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలకు ఆ వీడియోలు హాయిగా ఉంటున్నాయి.
టీవీ చానల్ చర్చల నిర్వహణలో ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. సాంబశివరావు స్టైల్ సాంబశివరావు. ఆయనకు, టీవీ5 యాజమాన్యానికి ఎక్కడ కుదిరిందో కానీ మూర్తి లాంటి జర్నలిస్టు చానల్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన డిబేట్లకు ఎలాంటి సమస్యలు రాలేదు. కొంత మంది ఆయన టీవీ5లో పార్టనర్ అని చెబుతారు. ఓ సారి సినిమా హీరోయిన్లపై దారుణమైన బూతుపదం వాడారు. అలాంటిది లైవ్ లో వాడిన జర్నలిస్టు కెరీర్ ఆ రోజుకే చివరిది అయ్యేది. కానీ ఆయనను టీవీ5 యాజమాన్యం ఏమీ అనలేదు.ఆ ఫ్లో అలా కొనసాగుతూ వచ్చింది. మధ్యలో కొన్నాళ్లు ఆయన వేరే చానల్ ఏదో లీజుకు తీసుకుని వెళ్లిపోయారని అనుకున్నారు. అది ఏ చాపలో ఎవరికీ తెలియదు. అలా అయితే ఎవరూ పట్టించుకోరని మళ్లీ టీవీ5కి వచ్చేశాడు.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూడా కొనసాగింది. అప్పుడు పరిధి దాటకుండా సెటైర్లు వేసి ప్రశ్నించారని వైరల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు భజన కోసం తన ప్రతిభను చూపుతున్నారు. బోడిగుండుకి..మోకాలికి ముడి వేసి మరీ భజన చేస్తున్నారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. లేనిపోని క్రెడిట్లు టీడీపీ పెద్దలకు కట్టబెట్టేస్తున్నారు. అవి మీర ఓవర్ ది బోర్డ్ గా ఉంటున్నాయి. వాటిని ఎవరూ నమ్మరు కానీ నవ్వులాట అయిపోతున్నాయి.
ఎన్నికల ఫలితాలకు ముందు .. సాక్షి టీవీలో ఈశ్వర్ చేసిన స్పీచ్ లు.. ఇప్పటికీ కామెడీగానే .. ట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్లకు సాంబ అలాంటి స్టఫ్ ఇస్తున్నారు. అందుకే ఆయనకు కొన్నాళ్లు విశ్రాంతి ఇవ్వాలని టీడీపీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి టీవీ5 యాజమాన్యం ఆలకిస్తుందా?
