దేనికైనా టైం చాలా ముఖ్యం. కాలం బావుంటే అన్నీ కలిసొచ్చేస్తాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా మంచి టైమింగ్ లో పడింది. ఊహించని ఈవెంట్ కలిసొచ్చింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత ఏఆర్ రెహ్మాన్ హైదరాబద్ లో లైవ్ షో నిర్వహించారు. రెహ్మాన్ షో అంటే ఆ క్రేజ్ వేరు. ఈ షోకి ఆరంభ టికెట్ ధర 2000, వేదిక రామోజీ ఫిల్మ్ సిటీ.. అయినప్పటీ జనం పోటెత్తారు. వేల మంది హాజరయ్యారు.
ఇలాంటి గ్రాండ్ లో ఈవెంట్ పెద్ది భాగమైయింది. పెద్దికి రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లైవ్ షోలో ఫస్ట్ సింగిల్ చిరికి చిరికి ప్లే చేశారు. అలాగే ఫస్ట్ షాట్ బీజీఎం కూడా పెర్ఫామ్ చేశారు. రామ్ చరణ్, జాన్వి, బుచ్చిబాబు షోకి హాజరయ్యారు. చరణ్ వేదికలో మాట్లాడారు. ‘రెహమాన్ గారి మ్యూజిక్ లో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీం. అది నా ఫేవరేట్ సబ్జెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినంది’అన్నారు.
జాన్వి కపూర్ తెలుగులో మాట్లాడటం విశేషం. ‘పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదృష్టం. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం’అని చెప్పుకొచ్చింది.
చరణ్, జాన్వి ప్రజెన్స్ మరింత సందడి తీసుకొచ్చింది. పెద్ది సినిమా, చికిరి సాంగ్ వేలమందికి లైవ్ లో రీచ్ అయ్యింది. నిజానికి ఇలాంటి ఒక ఈవెంట్ పెట్టాలంటే నిర్మాతలకి కోట్లలో ఖర్చు. కానీ పెద్దికి ఈ షో భలే కలిసొచ్చింది. ఫ్రీగా తమ పాటని పబ్లిసిటీ చేసుకొన్నారు. ఈ షోతో.. పాట మరింతగా జనంలోకి వెళ్లిపోయింది.


