వైసీపీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పూర్తిగా క్లారిటీ వస్తోంది. పదేళ్ల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనికి సమయం కేటాయిస్తున్న వారికి ఇప్పుడు ఆదరణ ఉండటం లేదు. కొత్త కొత్త వారు వచ్చి పాత వారికి సుద్దులు చెబుతున్నారు. పెత్తనం చేస్తున్నారు. దీంతో పాత ఖాతాలన్నీ స్లో అయిపోతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో చాలా కొద్ది మందికే తెలుస్తోంది.
జగన్ కోసం ట్విట్టర్ సైనికులుగా మారిన ఫ్యాన్స్
జగన్ రెడ్డి కోసం కొంత మంది ఫ్యాన్స్ ట్విట్టర్ సైనికులుగా మారారు. వీరిలో చాలా మందికి ఉద్యోగాలు ఉండవు. ఉన్నవారిలో సగం మంది సోషల్ మీడియా కేసుల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా జగన్ రెడ్డి ఫ్యాన్స్. పార్టీకి వీరు గొప్పగా సాయం చేస్తూంటారు. ఏ పోస్టులు పెట్టమంటే ఆ పోస్టులు పెడుతూ ఉంటారు. ఎక్కువగా కేసుల పాలవుతోంది కూడా వీళ్లే. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారిది. పట్టించుకునే వారు లేకుండా పోయారు. కొత్తకొత్తగా ఎవరెవరో వచ్చి వీళ్లకు నీతులు చెబుతున్నారు.
కొత్త సోషల్ మీడియా సైన్యాన్ని సిద్ధం చేస్తున్న సజ్జల
సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని విభాగాలను క్యాప్చర్ చేసినట్లే సోషల్ మీడియాను క్యాప్చర్ చేశారు. అసలు సోషల్ టీములను బలోపేతం చేసింది విజయసాయిరెడ్డి. ఆయన ఫ్యాన్స్ అందులో ఎక్కువగానే ఉంటారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి మొదట ఇంచార్జ్ గా నియమించారు. తర్వాత సజ్జల ఆయనను బయటకు పంపించి తన కుమారుడికి చాన్స్ ఇప్పించారు. కేసుల భయంతో కుమారుడని తప్పించి.. అంజిరెడ్డి అనే ఎకరాను ఆ ప్లేస్ లో పెట్టారు. అప్పటి నుంచి జగన్ అభిమానులను ఏరివేయడం ప్రారంభించారు. వారంతట వారు విరక్తి పుట్టిపోయేలా చేస్తున్నారు. లేకపోతే కేసుల పాలయ్యేలా చేసి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఓ వైపు తన నేతృత్వంలో సొంత టీం.. మరో వైపు పాత జగన్ ఫ్యాన్స్ ను ఎలిమినేట్ చేయడం వంటివి సజ్జల ఎకకాలంలో చేస్తున్నారు.
అందుకే సోషల్ మీడియాలో సజ్జలకే ఎలివేషన్లు
వైసీపీలో ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనే కనిపిస్తున్నారు. చివరికి పోస్టర్లు వేసేటప్పుడు సజ్జలను మాత్రమే హైలెట్ చేస్తున్నారు. జగన్, వైఎస్ఆర్ ఫోటోలు ఉండటం లేదు. దీనిపై నిరాదరణకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అసలు పార్టీ ఎవరిదని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అసలు విషయం జగన్ రెడ్డికి తెలియడం లేదేమో కానీ… జగన్ రెడ్డి సైన్యం అంతా ఎలిమినేట్ అవుతోంది.. సజ్జల సైన్యం అంతా వైసీపీని ఆక్రమిస్తోంది.


