తిరుమల శ్రీవారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. ఆయన సమక్షంలో చిన్న తప్పు చేయాలన్న ఆలోచన వస్తేనే నిలువెల్లా వణికిపోయే భక్తులు ఉంటారు. ఆయనకు సేవలు చేసే అవకాశం వస్తే విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి దేవుడ్ని దోచుకోవడం అంటే మామూలు విషయం కాదు. వారికి దేవుడిపై నమ్మకం లేనట్లే. ఇప్పుడు వారి పాపం పండింది. ఒక్కొక్క అరాచకం బయటకు వస్తోంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
చంద్రబాబు బయటపెట్టినప్పుడు సంచలనం
ఐదేళ్ల పాటు తిరుమలలో అరాచకం చేశారని.. పశువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారని చంద్రబాబు ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలు రేగింది. వెంటనే సిట్ దర్యాప్తు చేసింది . వెంటనే ఉలిక్కిపడి భుజాలు తడుముకున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలోనే సిట్ ను నియమించింది. సీబీఐ డైరక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు ప్రారంభమయింది. ఆ దర్యాప్తునూ అడ్డుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. చేస్తున్నారు. కానీ ప్రతి దానికి ఓ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లోనూ అంతే. ఎప్పుడో ఓ సారి దొరికిపోవాల్సిందే.
మెల్లగా తీగ లాగి డొంకను కదిలిస్తున్న సీబీఐ సిట్
పిటిషన్లు వేసి కొంత కాలం దర్యాప్తును టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి కొంత కాలం ఆపగలిగారు కానీ .. ఆయన తప్పించుకోలేరని స్పష్టమవుతోంది.వైసీపీ గెలిచినప్పటి నుండి కమిషన్లు తీసుకుని నకిలీ నెయ్యి కొనుగోలు చేయడం ప్రారంభించారు. దానికి తక్కువ రేటు కారణంగా చెప్పారు. నందిని లాంటి బ్రాండ్ ను కాదని.. ఎలా తయారు చేస్తారో.. కూడా తెలియని భోలేబాబా నుంచి నెయ్యి కొనాలని నిర్ణయించడమే అసలైన స్కాం. ఇది టీటీడీ చైర్మన్ కు తెలియకుండా జరగదు. కానీ ఆధారాలు ఉండాలి. అందుకే సీబీఐ ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారికి.. సుబ్బారెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. అధికారిక సమాచారం కోసం.. ఆయన అనుమతితోనే.. బ్యాంకుల నుంచి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ దాన్ని కూడా అడ్డుకోవాలని సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు.
దేవుడ్ని మోసం చేసి తప్పించుకోగలరా?
దేవుడిపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా.. కొండపై ఇలా చేయాలని అనుకోరు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని అనుకోరు. కానీ సుబ్బారెడ్డికి నిత్యం బైబిల్ పఠనం చేసే ఆయన భార్యకూ టీటీడీ ఓ ప్రయోగశాలగా మారింది. ఓ సందర్భంగా జగన్ రక్షకా గోవిందా అని పాటలు పాడారంటే చిన్న విషయం కాదు. ఒక్క నెయ్యి విషయంలోనే దొరికిపోతున్నారు. కానీ.. మొత్తం అన్ని విషయాల్లోనూ భయంకరమైన దోపిడీ చేశారు. విజిలెన్స్ రిపోర్టులు అన్నీ రెడీ అయ్యాయి. ఒక్క సారి పుట్టపగలిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి. దేవుడితో ఆటలాడిన అందరి పాపాలు పండుతాయి.


