రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకుంది. పర్యాటకంగానే ఉపయోగించాలని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియచేశారు. అంటే ఈ ప్యాలెస్ ను పర్యాటక విభాగంలోనే ఉంచనున్నారు. చాలా మంది రాజకీయ నేతలు దాన్ని రకరకాలుగా వాడాలని ప్రతిపాదించారు. కానీ ఆర్థికంగా ప్రయోజనకరంగా మారాలంటే.. టూరిజంలోనే ఉంచాల్సిన అవసరం కనిపిస్తోంది.
స్టార్ హోటల్ రేపు చెప్పి ఇళ్లు కట్టుకున్న జగన్
రుషికొండ మీద గతంలో మంచి రిసార్టు ఉండేది. టూరిజానికి కోట్ల ఆదాయం వచ్చేది. మంచి రిసార్టులు మొత్తాన్ని కూల్చి వేసి స్టార్ హోటల్ కడతామని నమ్మించారు. కానీ అక్కడ కట్టింది జగన్ రెడ్డి కోసం ఇళ్లు. ప్రజల ఖాతాల్లో చిల్లర వేస్తున్నామని తానిక రాజునేనని.. ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ ఆ రాజు కిరీటాన్ని ప్రజలు పీకిపడేశారు. ఇప్పుడు ప్యాలెస్ ను ఎలా వాడాలో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
కన్వెన్షన్ సెంటర్ గా మార్చే ఆలోచన
ఆ ప్యాలెస్ నిర్వహణతో పాటు పెట్టిన పెట్టుబడికి ..తగ్గ ఆదాయం రావాలి. టూరిజం శాఖ నిర్వహిస్తే అంత రాకపోగా .. ప్యాలెస్ నిర్వహణ భారం అవుతుంది. అందుకే ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకు.. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుని.. టెండర్లు పిలిచే అవకాశం ఉంది. మరో తొమ్మిది ఎకరాలు కూడా విశాలమైన ప్రాంతం ఉంది. శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా ఆ ప్లేస్ కూడా కన్వెన్షన్ ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
జగన్ సైకోతనానికి సాక్ష్యంగా ప్రజల సందర్శనకు ఉంచితే బెటర్
అయితే అమరావతిని కూల్చివేయడానికి జగన్ రెడ్డి ప్రారంభించిన ప్రజావేదిక విధ్వంస శకలాలను అక్కడే ఉంచారు. అలాగే.. ఆయన సైకో మనస్థత్వానికి వికృతమైన రాజుల ఆలోచనలు ఎలా ఉంటాయో వివరించడానికి ఈ ప్యాలెస్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని..దాన్ని ప్రదర్శనకు పెట్టాలన్న అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలకుడు ఇది వరకెప్పుడూ రాడు.. ఇక ముందురాడు అని ప్రజలకు తెలియాలి.


