భారత రియల్ ఎస్టేట్ రంగం 2025లో సస్టెయినబుల్ హోమ్స్ కాన్సెప్ట్ ను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. వాతావరణ మార్పుల ఒత్తిడి, ప్రభుత్వ ప్రోత్సాహం, మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులతో సస్టైనబుల్ బిల్డింగ్స్ ప్రధానంగా మారుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టుల్లో 25 శాతం గ్రీన్ సర్టిఫైడ్ అవుతున్నాయని CII-కాలర్స్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ సంఖ్య 50 శాతానికి, 2047 నాటికి 75 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.
సస్టైనబుల్ బిల్డింగ్స్ అంటే కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు ఇవి ఎనర్జీ, నీరు, మెటీరియల్స్ సమర్థవంత ఉపయోగం, ఆరోగ్యకరమైన జీవనశైలి, దీర్ఘకాలిక ఆదాయాలను కలిగి ఉంటాయి. ఈ భవనాలు IGBC, GRIHA, LEED, EDGE, WELL వంటి అంతర్జాతీయ సర్టిఫికేషన్లతో వస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1,200కు పైగా ప్రాజెక్టులు ఈ సర్టిఫికేషన్లు పొందాయి. ఢిల్లీలో లోధా, గోద్రేజ్ వంటి డెవలపర్లు 80 శాతం ప్రాజెక్టులను LEED సర్టిఫైడ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో మై హోమ్ భూజ, ప్రెస్టీజ్ హై ఫీల్డ్స్ వంటి ప్రాజెక్టులు GRIHA 4-5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి.
నెట్-జీరో ఎనర్జీ భవనాలు ఈ రంగంలో కొత్త ట్రెండ్‌గా మారాయి. సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, స్మార్ట్ గ్రిడ్స్ ద్వారా ఈ భవనాలు తమకు తామే ఎనర్జీ ఉత్పత్తి చేసుకుంటాయి. 2030 నాటికి 10 శాతం భవనాలు నెట్-జీరో స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. నీటి సంరక్షణ కూడా సస్టైనబుల్ డిజైన్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. రెయిన్వాటర్ హార్వెస్టింగ్, గ్రేవాటర్ రీసైక్లింగ్, లో-ఫ్లో ఫిక్చర్స్ ద్వారా 40 శాతం నీటిని ఆదా చేయవచ్చు. స్మార్ట్ టెక్నాలజీలు సస్టైనబుల్ భవనాలను మరింత సమర్థవంతం చేస్తున్నాయి.
ప్రభుత్వం ఈ రంగానికి బలమైన మద్దతు ఇస్తోంది. గ్రీన్ హోమ్స్ 10-15 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కానీ దానికి తగ్గ ప్రయోజనం ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే సస్టెయినబుల్ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతోంది.


