వైఎస్ జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగి చంద్రబాబు రాగానే వీఆర్ఎస్ తీసుకుని ఇంటికెళ్లిపోయిన మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కు నిద్రపట్టడం లేదు. తాను చేసిన తప్పులు.. చూస్తూ ఉండిపోయిన తప్పులు చూసి ఆయన కుమిలిపోతున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జనగ్ హయాంలో ఉన్నతాధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్‌లకు అన్యాయం జరుగుతూంటే ఆపలేకపోయాయనన్నారు.
జగన్ మోహన్ రెడ్డి కావాలనే ఈ అన్యాయాలు చేశారు. అది రాజకీయ కారణాల వల్లే జరిగిందని ప్రవీణ్ ప్రకాష్ వీడియోలో పేర్కొన్నారు. ABVకు 2019లో జరిగిన సస్పెన్షన్, జాస్తి కృష్ణకిషోర్‌కు APEDBలో ఆరోపణలు, సస్పెన్షన్ వంటివి రాజకీయ ప్రతీకారం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. ABVకి, జాస్తి కృష్ణ కిషోర్ గారికి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయాను. నేను ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఈ అన్యాయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించాను కానీ సక్సెస్ కాలేదు. అది నా తప్పు, పబ్లిక్‌గా క్షమాపణ చెబుతున్నాను అని భావోద్వేగంతో వీడియోలో ప్రకటించారు. YSRCP హయాంలో అనేక మంది IAS, IPS అధికారులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకున్నారని, అది సరైనది కాదన్నారు.
టీడీపీ హయాంలో కీలకంగా పని చేసిన అధికారులు ముఖ్యంగా ఓ సామాజికవర్గం అధికారుల్ని జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే టార్గె్ట చేసుకున్నారు. తప్పుడు కేసులతో వారిని వేధించారు. వారు తప్పులు చేయకపోయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు ఫిర్యాదులు చేయించి..ఫేక్ ప్రచారాలు చేసి వారి కెరీర్లను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఏబీవీ వెంకటేశ్వరరావు ఐదు సంవత్సరాల పాటు సర్వీస్ కోల్పోయారు. జాస్తి కృష్ణకిషోర్ నిజాయితీ తెలిసిన కేంద్రం జగన్ వేధింపుల నుంచి కాపాడి కేంద్ర సర్వీసులకు తీసుకెళ్లింది. ఏపీ ఈడీబీ బాధ్యతలను జాస్తి కృష్ణకిషోర్ చూసుకునేవారు.
ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారో కానీ.. తాను చేసిన పనికి తనకు నిద్రపట్టడం లేదని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే ఏబీఎన్ ఆర్కేకు ఇంటర్యూ ఇచ్చారు. ఇప్పుడు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఆయన ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఆయన వీఆర్ఎస్ పూర్తి అయిపోయింది. మళ్లీ దాన్ని రీవోక్ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారేమో కానీ ఇలా క్షమాపణలు చెబుతున్నారు.


