వైసీపీ హయాంలో సీమ సీఎంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. మిథున్ రెడ్డి అసలు కనిపించడం లేదు. పెద్దిరెడ్డి మాత్రం జగన్ రెడ్డితో సమావేశాలుంటే సైలెంటుగా వచ్చి వెళ్తున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకూ చర్యల విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ఆయన టీడీపీతో కుమ్మక్కయ్యారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి ఇష్యూని పవన్ కల్యాణ్ టేకప్ చేసినట్లుగా కనిపిస్తోంది.
పెద్దిరెడ్డి కబ్జాలపై వీడియో సాక్ష్యాలు – కేబినెట్ లోచెప్పిన పవన్
పవన్ కల్యాణ్ ఇటీవల చిత్తూరు జిల్లా మంగళం అడవుల్లో పర్యటించి వచ్చారు. డ్రోన్ లతో .. కబ్జాలను పరిశీలించారు. అడవి మధ్యలో పెద్దిరెడ్డి కుటుంబానికి వారసత్వ భూమి ఉంది. అడవిలో వారసత్వ భూమి ఎలా వస్తుందో లెక్కలు తీయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. నిజానికి ఆ భూమిపై గతంలోనూ వివాదం రేగింది. అసలు కొంత అయితే..కలిపేసుకుంది ఎంతో ఉందని తేలింది కూడా. అయినా ఇంకా చర్యలు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పవన్ సీరియస్ గా తీసుకున్నారు. కేబినెట్ కు వివరాలు సమర్పిస్తానని చెప్పారు. అదే సమయంలో కబ్జా చేసిన వారి పేర్లను వెబ్ సైట్ కు ఎక్కిస్తామని కూడా ప్రకటించారు.
పెద్దిరెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి చేసిన పాపాలు చిన్నవి కావు. స్వయంగా లోకేష్ పాపాల పెద్దిరెడ్డి అని ..అధికారంలోకి వస్తే మొత్తం తేల్చేస్తామని ప్రకటించారు కూడా. ప్రభుత్వం మారిన మొదట్లో ఆయన అక్రమాలపై వరుసగా కేసులు పడ్డాయి. దేంట్లోనూ ఆయన అరెస్టు కాలేదు. ఒక్క లిక్కర్ స్కాంలో మాత్రం మిథున్ రెడ్డి అరెస్టు అయ్యారు. బెయిల్ తెచ్చుకున్నారు. హాయిగా తిరుగుతున్నారు. కానీ పెద్దిరెడ్డిపై ఇంకా ఈగ కూడా వాలలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే.. ఉన్న సాక్ష్యాలతో ఒక్క గంట సరిపోతుంది.
పెద్దిరెడ్డిని వదిలే ఉద్దేశంలో లేని పవన్
కక్ష సాధింపులు అనుకుంటారని ఆలోచిస్తున్నారో.. రాజకీయంగా పెద్దిరెడ్డి ఏమైనా వైసీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారో కానీ ఇప్పటి వరకూ ఆయనకు పెద్దగా సమస్యలు రాలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. తన శాఖ పరిధిలో పెద్దిరెడ్డి చేసిన అక్రమాలపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే..పెద్దిరెడ్డికి చిక్కులు తప్పకపోవచ్చు. పవన్ పంజా నుంచి తప్పించుకోలేకపోవచ్చు.


