ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ని ఓడించే అవకాశం భారత్ చేతికి చిక్కింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకి తొలి రోజు 159 పరుగులకే కుప్పకూలింది సఫారీ జట్టు. ఇక రెండో రోజు ఆట మరింత రసవత్తరంగా సాగింది. మన బ్యాటర్లు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. ఓవర్‌నైట్ స్కోర్ 37/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 189 పరుగులే చేసింది.
స్వల్ప ఆధిక్యం లభించడంతో ఆట ఎటువైపు తూగుతుందా అనే ఆసక్తి ఏర్పడింది. అయితే మన బౌలర్లు ఆదరగొట్టారు. ఇవాళ ఒక్కరోజే 16 వికెట్లు పడ్డాయి. మన స్పిన్నర్ల ధాటికి సఫారీ జట్టు బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. టీ బ్రేక్ సమయానికి 18/1తో నిలిచిన దక్షిణాఫ్రికా చివరి సెషన్లో ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 93/7 స్కోరుతో నిలిచి 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోర్బిన్ బాష్ (1), తెంబా బావుమా (29) క్రీజులో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత గెలుపు తధ్యం. మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోవడం ఖాయం.


