రాజ్ తరుణ్ కి కొన్నాళ్లుగా విజయాలు లేవు. తన పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది. ఏవో సినిమాలు చేస్తున్నాడు గానీ అవి సరిగ్గా రిలీజ్ కూడా కావడం లేదు. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. మంచి సక్సెస్ ఇప్పుడు చాలా తన కెరీర్ కి చాలా అవసరం. ఇలాంటి సందర్భంలో ‘పాంచ్ మినార్’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఇదొక క్రైమ్ కామెడీ. ఆ జానర్ కి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ లో కనిపించాయి. ఉద్యోగం చేయడానికి ఇష్టపడని హీరో ప్రేమించిన అమ్మాయి కారణంగా ఓ ఉద్యోగంలో చేరుతాడు. ఇక్కడే కథ అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఒక మాఫియా బ్యాచ్ కి సంబంధించిన పెద్ద మనీ బ్యాగు తన చేతికి చిక్కుతుంది. ఆ తర్వాత ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకున్నది అనేది కీలకం.
రాజ్ తరుణ్ క్యారెక్టర్ డిజైన్ ఆసక్తికరంగానే ఉంది. బ్రహ్మజీ. అజయ్ ఘోష్, సుదర్శన్ లాంటి మంచి టైమింగ్ వున్న నటులు కూడా ఉన్నారు. ఇలాంటి సినిమాలకి కామెడీ వర్కౌట్ అయితే పైసా వసూల్ అవుతుంది. నవంబర్ 21న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది. అంతకుముందు ప్రీమియర్స్ వేసే ఆలోచనలో కూడా ఉన్నారు నిర్మాతలు.

