వైఎస్ జగన్ రాజకీయంలో దళిత నేతలకు, దళిత మేధావులు, దళిత కార్యకర్తలకు ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. వారందర్నీ ఆయన తన అడ్డగోలు రాజకీయాలు షీల్డులా వాడుకుంటారు. అందుకే ఏరి కోరి.. కొంత మందిని ఎంపిక చేసుకుంటారు. వారితో పనులు చేయిస్తారు. వారినే కేసుల్లో ఇరికిస్తారు. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తారు.కానీ ఎక్కడో ఉన్న తమను పైకి తీసుకు వచ్చారని.. వారంతా అనుకుంటారు. కానీ తమ జీవితంతో ఆడుకున్నారని మాత్రం చాలా ఆలస్యంగా తెలుసకుంటారు. అలాంటి వారు ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ఏడుస్తున్నారు.
నందిగం సురేష్ ను ఇప్పుడు దగ్గరకు రానివ్వడం లేదట !
అమరావతిలో చెరుకుతోటలకు నిప్పు పెట్టి జగన్ దగ్గర అభిమానం పొందిన వ్యక్తి నందిగం సురేష్. జగన్ పేరు చెప్పాలని పోలీసులు చిత్రహింసలు పెట్టినా చెప్పలేదని చెప్పుకుని జగన్ కు మరింత దగ్గరయ్యారు. అలా చెప్పి ఆయన జగన్ కు దగ్గరయ్యాను అని అనుకున్నారు కానీ.. జగన్ దళితకార్డుతో ఆయనను ఎలా వాడుకోవాలో చూసి అందుకే ఆయనకు ఎంపీగా చాన్సిచ్చారు. వాడుకోగలిగినంత వాడుకున్నారు. పదవి పోయాక..జైలు పాలయితే పట్టించుకోవడం మానేశారు. ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టారు. ఆయన భార్యకు టిక్కెట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు
రెండు సార్లు జైలుకెళ్లి వచ్చాక ఇప్పుడు ఆయనను తాడేపల్లి వైపు రానివ్వడం లేదట. అందుకే ఆయన బాధపడిపోతున్నారు.
నందిగం సురేష్ ఓ పావు.. అలాంటి వాళ్లు ఎంతో మంది !
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వివాదాస్పదం నిర్ణయం తీసుకోవాలన్న పూర్తిగా దళిత కార్డే వాడేవారు. తన రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు పీవీ సునీల్ కుమార్, సంజయ్ అనే దళిత అధికారుల్ని ఉపయోగించుకున్నారు. వారికి అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ చేయక తప్పింది కాదు. ఇప్పుడు వారిలో ఒకరు జైలు పాలయ్యారు. మరొకరు అదే దారిలో ఉన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ జగన్ ఇదే చేసేవారు. ఇప్పుడు వారందర్నీ రోడ్డున పడేస్తున్నారు. కొత్త వారిని ఎంచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా ప్రశాంతంగా ఉన్న జీవితాలను నాశనం చేసుకున్న దళిత వర్గానికి చెందిన నేతలు, మేధావులు, అధికారులు పెద్ద ఎత్తున ఉంటారు.
మతాభిమానంతో అభిమానించేవారినీ వదలని జగన్
జగన్మోహన్ రెడ్డిని మతాభిమానంతో అభిమానించే వర్గం ఉంటుంది. అధికారులతో పాటు ఇతర వ్యవస్థల్లోనూ ఉంటారు. వారికి పదవులు .. ప్రాధాన్యత పేరుతో జగన్ ట్రాప్ చేస్తారు. కానీ వారు అక్కడ చేయాల్సింది వేరు. వారి పేరుతో ఇతరులు పనులు చక్కబెడతారు. వీరు ఇరుక్కుపోతారు. హోదా మాత్రం ఉంటుంది. కానీ వీరి పేరుతో ఇతరులు చేసిన పనుల వల్ల వీరి జీవితాలు ఖల్లాస్ అవుతాయి. కొంత డబ్బు మిగులుతుందేమో కానీ.. అప్పటి వరకూ సంపాదించుకున్న పరువు, ప్రతిష్ట.. అన్నీ పోతాయి. కానీ వారు ఇప్పటికీ నిజం తెలుసుకుంటున్నారో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే అది జగన్ ట్రాప్.
