స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సూటిగా లక్ష్యానికి గురి పెట్టాయి. తన వ్యాఖ్యలను ఎవరు ఎలా తీసుకోవాలో..అలా తీసుకునేలా ఆయన మాట్లాడారు. ఆ ప్రకారం వైసీపీ, సాక్షి మీడియా కూడా చంద్రబాబు లక్ష్యానికి తగ్గట్లుగా ప్రచారం కల్పిస్తోంది. స్టీల్ ప్లాంట్ ఉత్పాదకత అతి తక్కువగా ఉండటం వల్ల నష్టాలొస్తున్నాయి. అలా ఎందుకంటే అంటే ఉద్యోగులు పని చేయడం లేదు. పని చేసినంత, ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయనపై వ్యతిరేకత పెంచాలని వైసీపీ, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారంతో.. పని చేయకుండా జీతాలెందుకివ్వాలన్న ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తోంది. ఇది చంద్రబాబు వ్యూహాత్మకంగా సాధిస్తున్న ప్రజాభిప్రాయం.
స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే ఏకైక ఎజెండా !
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు .. అందులో డౌట్ లేదు. కానీ ఇది నినాదానికే. ఆ ఉక్కులో ఒక్క రూపాయి వాటా కూడా ఏపీ ప్రభుత్వానికి లేదు. అంటే ప్రజలకు లేదు. అందులో ఉన్న ఏపీ ఉద్యోగులు రోడ్డున పడకుండా ఉండాలంటే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఉద్యోగులు ఎందుకు రోడ్డున పడతారంటే.. స్టీల్ ప్లాంట్ మూతపడితేనే రోడ్డున పడతారు. కనీసం ప్రైవేటులో అయినా ఉంటేనే వారి జీవితాలు సేఫ్ గా ఉంటాయి. అయితే ప్రైవేటీకరణ వరకూ వెళ్లకూడదని.. చంద్రబాబు తనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకుని వీలైనంత వరకూ నిధులు తీసుకు వచ్చేలా చేశారు. దీన్ని ఉపయోగించుకుని సంస్థను బతికించుకోవాల్సిన ఉద్యోగులు.. గొంతెమ్మ కోరికలతో రోడ్డు మీదనే ఉన్నారు. ఉత్పత్తిని పట్టించుకోవడం లేదు.
పని చేయకుండా జీతాలెందుకని చర్చ పెట్టిన చంద్రబాబు
ఒక్క సారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక పని చేయకపోయినా పర్వాలేదని అనుకునే మనస్థత్వం చాలా మందిలో ఉంది. చాలా మంది అలాగే అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మికులు, ఉద్యోగుల సంఖ్యతో పోలిస్ేత సగం మంది కూడా పెద్దగా పని చేయకుండానే ఇతర స్టీల్ ప్లాంట్లు లాభాలు సంపాదిస్తూ ఉంటాయి. మరి ఇంత మ్యాన్ పవర్ పెట్టుకున్న స్టీల్ ప్లాంట్ కు ఎందుకు లాభాలు రావనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ విషయంపై చంద్రబాబు మాటలకు.. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
చంద్రబాబు మాటలకు మరింత మద్దతు వచ్చేలా చేస్తున్న వైసీపీ
పని చేయకుండా జీతాలివ్వాలా అంటే ఏ ఒక్కరు కూడా.. ఇవ్వాలని చెప్పరు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానిది. అందులో పోసే ప్రతి పైసా ప్రజలు పన్నులుగా చెల్లించేదే. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పని చేయకుండా.. కూర్చుంటే తాము డబ్బులు చెల్లించాలా అని ఆలోచిస్తారు. ప్రైవేటీకరణ వల్ల నష్టమేంటి అన్న చర్చ ప్రారభమవుతుంది. స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకపోతే.. ఎల్లకాలం ఫండింగ్ ఇస్తూ పోలేరు. చంద్రబాబు అదే చెప్పారు. కాపాడుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉంది. కష్టపడి పని చేసి..త సంస్థను గట్టెక్కించుకోవాలి. గతంలో కేంద్రం ఒకటే మాట చెప్పింది.. అయితే ప్రైవేటీకరణ లేకపోతే మూసివేత అని. అాలంటి పరిస్థితి రాకుండా.. బయటపడేలా చంద్రబాబు మరో అవకాశం తెచ్చారు. దాన్ని వినియోగించుకుంటేనే ప్రయోజనం.


