ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, టీవీ యాంకర్ శ్యామల సీఐడీ విచారణకు హాజరయ్యారు. మార్చి 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్ నమోదైన ఈ కేసు, ఇప్పుడు సీఐడీకి బదిలీ అయింది. శ్యామలతో పాటు 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి.
శ్యామల సహా పలువురు రు చైనా లింక్డ్ బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. ఈ యాప్లు యూజర్లకు ఆర్థిక నష్టాలు, ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నాయని కేసులు నమోదయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. గతంలో శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2-3 గంటలు విచారణ జరిగింది. తన అడ్వకేట్తో పాటు హాజరైన ఆమె, బెట్టింగ్ యాప్లతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు గురించి ప్రశ్నలు ఎదుర్కొంది. మరోసారి ఇప్పుడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇతర సెలబ్రిటీలను కూడా పిలిచి ప్రశ్నిస్తున్నారు. టీవీ యాంకర్ గా , సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ గా ఉన్న శ్యామల రాజకీయాల్లోకి వెళ్లారు. వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.