వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న శంకరయ్య.. దగ్గర ఉండి మరీ సాక్ష్యాలను తుడిపించేశారు. అది కళ్ల ముందు ఉన్న నిజం. స్వయంగా శంకరయ్య కూడా అదే మాట సీబీఐకి చెప్పారు. కానీ చంద్రబాబునాయుడు సీఎం హోదాలో వివేకా హత్యకేసు గురింంచి మాట్లాడితే లీగల్ నోటీసు పంపించారు. వీఆర్లో ఉన్న సీఐ ఇలా చేయడంతో పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. ఇప్పుడు ఆయన నేరుగా వివేకా హంతకుల కోసం పని చేసుకోవచ్చు.
శంకరయ్య లాంటి వాళ్లతో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించిన హంతకులు
పులివెందులలో ఎవరు పని చేసినా.. వారు వైఎస్ కుటుంబకనుసన్నల్లో పని చేయాల్సిందే. ఎవర్ని నియమించినా అంతే. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ శంకరయ్య లాంటి వాళ్లు పులివెందుల సీఐగా ఉన్నారంటే అది వారం బలం. వివేకా అనుమానాస్పదంగా చనిపోయిన ఒక్క పోలీసు రాకుండా చూసుకున్నారు. ఒక్క సీఐను మాత్రమే రానిచ్చారు. ఆయన దగ్గరుండి సాక్ష్యాలను తుడిపించారు. సీబీఐ ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మొదట నిజం చెప్పి తర్వాత రివర్స్ అయ్యారు. ఫలితంగా ఆయనకు మంచి పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగాన్నే పోగొట్టుకున్నారు.
వివేకా హంతకులతో ఇప్పటికీ చెట్టాపట్టాల్
వివేకానందరెడ్డి హంతకులకు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని నేరుగా చంద్రబాబుకు ఆయన ఇచ్చిన నోటీసులతోనే స్పష్టమవుతోంది. హత్య కేసు నుంచి బయటపడేందుకు ఎన్ని తప్పులు చేయాలో అన్నీ చేస్తున్నారు.కానీ అన్నింటిలోనూ దొరికిపోతున్నారు. మరింత కూరుకుపోతున్నారు. హత్య జరిగినప్పుడు విధుల్లో ఉన్న పోలీసుల్ని ప్రలోభపర్చి లోబర్చుకుంటే నేరాన్ని నిరూపించకుండా ఉండలేకపోతారా?. సాక్ష్యాలు తుడిచేయలేదని నిరూపించుకోగలరా ?
డిస్మిస్ చేయాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది !
నిజానికి వైసీపీతో అంట కాగి తాము ఉద్యోగం చేస్తున్నామా.. వైసీపీ నేతలు కలిసి హత్యలు, దోపిడీలు చేస్తున్నామని అన్నది తెలుసకోకుండా వ్యవహరించిన శంకరయ్య లాంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ.. చట్టం అంటే ఏమిటో తెలియచేసి.. శంకరగిరి మాన్యాలకు పట్టించావాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే వారు వ్యవస్థలకు చీడపురుగుల్లా మారుతారు.