భారతి సిమెంట్స్ లీజులను రద్దు చేస్తారని.. నిబంధనలకు విరుద్ధంగా జగన్ వాటిని తమ కంపెనీకి కేటాయించుకున్నారని ఏడాదిగా చెబుతున్నారు. ఇదిగో రద్దు చేయబోతున్నారు.. అదిగో రద్దు చేయబోతున్నారని లీకులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకూ రద్దు చేయేలదు. వచ్చే వారంలో నోటీసులు ఇస్తారని తాజాగా చెబుతున్నారు.
భారతి సిమెంట్స్ తో పాటు మరో రెండు సిమెంట్ కంపెనీలకు ఇచ్చిన లైమ్‌స్టోన్ మైనింగ్ లీజులను రద్దు చేయడానికి తగ్గ ఆధారాలు ఉన్నాయి. అర్హత లేకపోయినా జగన్ సీఎంగా ఉండగా 2024 మార్చి-ఏప్రిల్‌లో ఆక్షన్ లేకుండా నేరుగా కేటాయించుకున్నారు. ఇది కేంద్ర మైనింగ్ పాలసీలకు విరుద్ధమని భారతీయ ఖనిజ బ్యూరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం, మైనింగ్ లీజులు పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే కేటాయించాలి. IBM సమీక్షలో, లీజులు అక్రమంగా ఇచ్చారని తేల్చారు. అడ్వకేట్ జనరల్ “అక్రమమే, రద్దు చేయాలి” అని సిఫార్సు చేశారు. మైన్స్ డిపార్ట్మెంట్ ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో నోటీసులు జారీ చేసి రద్దు చేయనున్నారు.రద్దు తర్వాత, ఈ లీజులు పబ్లిక్ ఆక్షన్ ద్వారా కేటాయిస్తారు .