నారా లోకేష్ ముఖ్యమంత్రి కంటే చాలా బిజీగా ఉంటున్నారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు ..మరో వైపు పెట్టుబడులు విషయాల్లో తీరిక లేకుండా ఉంటారు. అదే సమయంలో ఆయన విద్యా మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. తాను నిర్వహిస్తున్న శాఖ చాలా కీలకమని.. భవిష్యత్ పౌరుల కోసమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే కొత్త కొత్త సంస్కరణలు , ప్రయత్నాలతో అద్భుత పనితీరు కనబరుస్తున్నారు.
విద్యావ్యవస్థలో సమూల మార్పులు
విద్యా మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటినుడంి విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు అడుగులు వేస్తున్నారు. AI, స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యకు సాయం వంటి వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల ఉద్యోగోపాధి, ఆవిష్కరణలకు దారి తీస్తున్నారు. 2029 నాటికి ‘వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్కరణలు రాష్ట్ర విద్యా వ్యవస్థను గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా మార్చాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం
లోకేష్ ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని వచ్చే విద్యాసంవత్సరం (2026) నుంచి అమలులోకి తెస్తున్నారు. స్వదేశం లేదా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు అండగా ఉండేలా పథకం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థులు విదేశాల్లో, 88,196 మంది స్వదేశంలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ పథకం వారికి ఫీజు రీయింబర్స్మెంట్, లోన్ గ్యారంటీలు, స్కాలర్షిప్లు అందిస్తుంది.
కరిక్యులం సంస్కరణలు- AI, స్కిల్ బేస్డ్ లెర్నింగ్
2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతున్న AI-ఇంటిగ్రేటెడ్ కరిక్యులం, ఉద్యోగోపాధికి సంబంధించిన స్కిల్ బేస్డ్ లెర్నింగ్ లోకేష్ సంస్కరణల ముఖ్య భాగం. హయ్యర్ ఎడ్యుకేషన్ కరిక్యులాన్ని పూర్తిగా ఓవర్‌హాల్ చేసి, ఇండస్ట్రీ-రెలవెంట్ సబ్జెక్టులు చేర్చారు. 26 డిప్లొమా కోర్సుల కరిక్యులం మార్చి, NAM టెక్ సంస్థతో 3 హబ్‌లు అభివృద్ధి చేశారు. 83 ప్రభుత్వ ఐటిఐలను పరిశ్రమలతో అనుసంధానం చేసి, పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 21,540 మందికి ట్రైనింగ్ అందించారు. 485 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాలు సృష్టిస్తున్నారు.
ఉపాధ్యాయులకు ప్రోత్సాహం
పాఠశాల స్థాయిలో ‘విలువలతో కూడిన విద్య’పై సమావేశాలు నిర్వహించి, రాజ్యాంగ దినోత్సవంలో స్టూడెంట్ అసెంబ్లీలు, ‘బాలల భారత రాజ్యాంగం’ ఆవిష్కరణ చేశారు. ఉత్తమ టీచర్లను సింగపూర్, ఫిన్‌ల్యాండ్‌కు పంపి ట్రైనింగ్ ఇప్పించే ఆలోచనల్లో ఉన్నారు. ఇప్పటికే నేరుగా వినూత్న పద్దతులతో విద్యాబోధన చేస్తున్న వారిని గుర్తించి స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. వ్యవస్థలో చేయాల్సిన మార్పుల గురించి మట్లాడుతున్నారు. అలాగే విద్యార్థి ఆత్మహత్యల నివారణకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఉమా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేస్తున్నారు. ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టి, గ్లోబల్ పార్ట్నర్షిప్లు ఏర్పరుస్తున్నారు.
విద్యామంత్రి నారా లోకేష్ .. భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేందుకు ఎంత కొత్తగా ఆలోచించాలో అంత కొత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు.
