జోగి రమేష్ జైలుకెళ్లి మూడు వారాలవుతోంది. మొదట్లో వైసీపీ నేతలు ములాఖత్‌లు నిర్వహించారు. ఇప్పుడు అది కూడా లేదు. జగన్ రెడ్డి పరామర్శిస్తాడని ధైర్యం చెబుతాడని రమేష్ కుటుంబం ఆశలు పెట్టుకుంది. కానీ జగన్ రెడ్డి తాను వచ్చేది లేదని సంకేతాలు పంపుతున్నారు. అరెస్ట్ అయినప్పుడు ఓ ట్వీట్ పెట్టి తన పని తాను చేసుకుంటున్నారు. పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో జోగి రమేష్ అనుచరులలో.. అసంతృప్తి కనిపిస్తోంది.
జగన్ ప్లాన్ వల్లే జైలుకు జోగి రమేష్
జోగి రమేష్ అక్రమ మద్యం వ్యాపారాన్ని తన అనుచరులతో చేయించి.. పట్టించి ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్నారు. అలాగే చేశారు. తర్వాత రాష్ట్రమంతటా అక్రమ మద్యం ఉందని ఆరోపించి.. ప్రతి సహజ మరణాన్ని అక్రమ మద్యం ఖాతాలో వేసి జగన్ రెడ్డి భారీ ఓదార్పు యాత్ర చేయాలనుకున్నారు. కానీ కుట్రను బద్దలు కొట్టేయడంతో జగన్ సైలెంటయ్యారు. కానీ జోగి జైలుకెళ్లాల్సి వచ్చింది. జగన్ మాత్రం పట్టించుకోవడంలేదు. కనీసం ఓ సారి పరామర్శించడం లేదు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు పొడిపొడిగా సానుభూతి చూపిస్తున్నారు.
అధికారంలో ఉంటే బూతులు, దాడులకు ప్రోత్సాహం – ఇప్పుడు వదిలేశారు!
అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ బలహీనతను ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారు వైసీపీ పెద్దలు. పదవి కోసం ఏం చేయమన్నా చేస్తాడని బూతులు తిట్టించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి పంపించారు. అసెంబ్లీలో రఘురామను కూడా ఘోరంగా తిట్టించారు. అన్నీ వినీ ఆనందంతో పులకరించిన జగన్.. తర్వాత వాటిని రికార్డుల నుంచి తీసేయమని సలహా ఇచ్చారు. ఐదు సంవత్సరాల పాటు జోగి .. జగన్ ను మానసికంగా సంతృప్తి పరిచేందుకు చేసిన వ్యవహారాలు ఆయనకు ఇప్పుడు పెను సమస్యగా మారాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడం మానేశారు.
జగన్ కోసమే అందరూ జైళ్లకు.. వారికేం ఖర్మ ?
మిథున్ రెడ్డి దగ్గరనుంచి జోగిరమేష్ వరకూ అందరూ జైళ్లకు వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు.. కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆయన అవినీతి సంపాదనకు.. మానసిక ఆనందం కోసం చేసిన పనుల వల్లే అందరూ జైలుకెళ్తున్నారు. అలా వెళ్లిన వారిపై కనీస సానుభూతి కూడా వైసీపీ వైపు నుంచి రావడం లేదు. జగన్ వారికి కర్మకు వారే బాధ్యులన్నట్లుగా ఉంటున్నారు. ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు జగన్ తెచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బకరాలు అంటే .. నిజంగా వైసీపీ నేతలేనని ఆ పార్టీ నేతలే జోకులేసుకుంటున్నారు.
