రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆమెకు దర్శకత్వంపై ఇష్టం ఉంది. తన సినిమా కోసం కథలు రాసుకుంటున్నారు. ఇదే సమయంలో నటనపై కూడా ఆమె ఫోకస్ వుంది. కాకపోతే సరైన ప్రాజెక్ట్స్ కుదరడం లేదు. ఆ మధ్య టైగర్ నాగేశ్వరరావు లో ఓ పాత్ర చేశారు. సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో అ పాత్రకి రావాల్సిన గుర్తింపు రాలేదు.
ఇప్పుడు మరో సినిమాసైన్ చేశారు. నిర్మాత డి.ఎస్. రావు కుమారుడు సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 16 రోజుల పండగ. వినాయకుడు ఫేం సాయికిరణ్ అడవి దర్శకుడు. ఈ సినిమాలో రేణు అత్త పాత్రలో కనిపిస్తున్నారు. ‘ఫస్ట్ టైం అత్త రోల్ చేస్తున్నాను. నా ఏజ్ కి సరిపోతుందా అనిపించింది. కానీ దర్శకుడు చెప్పిన కథ చాలా నచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కొత్తదనం ఫీలౌతారు’ అని చెప్పుకొచ్చింది రేణు.
పిల్ల జమీందార్, మిస్టర్ నూకయ్య, ద్రోణ లాంటి చిత్రాలని తీసిన నిర్మాత డి.ఎస్. రావు. ఆయనకి ఇండస్ట్రీలో చాలా మంచి పరిచయాలు వున్నాయి. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజకార్యక్రమానికి అల్లు అరవింద్, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి రవి, సురేష్ బాబు లాంటి సినియర్ నిర్మాతలు వచ్చారు. సాయికిరణ్ అడవి క్లాస్ టచ్ వున్న దర్శకుడు. ఆయనకి కూడా కంబ్యాక్ అవసరం. చాలా కాలంగా ఈ కథపై వర్క్ చేశారు. అన్నట్టు.. ఈ సినిమా టైటిల్ ’16 రోజుల పండగ’ డైరెక్టర్ కృష్ణవంశీ సూచన మేరకు పెట్టారట. అనూప్ రూబెన్స్ ఈ సినిమా మ్యూజిక్.