విశాఖపట్నంను ఏఐ,డేటా హబ్‌గా మార్చే క్రమంలో మరో ముందడుగు పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్, డిజిటల్ రియాల్టీల మధ్య జాయింట్ వెంచర్ గా ఏర్పడిన డిజిటల్ కనెక్షన్ 1 గిగావాట్ న AI-నేటివ్ డేటా సెంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. విశాఖలో సుమారు 11 బిలియన్ల డాలర్లు అంటే లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నామని ప్రకటించింది. విశాఖ డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాకు మారుతోందని నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్ట్ 400 ఎకరాల విస్తీర్ణంలో 2030 నాటికల్లా పూర్తవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ తో ఎంవోయూ చేసుకున్నారు. గూగుల్ చతర్వాత ఇది రెండో పెద్ద ఇన్వెస్ట్మెంట్గా నిలుస్తోంది. ఈ డేటా సెంటర్లు ప్రత్యేకంగా AI-నేటివ్‌గా, పర్పస్-బిల్ట్‌గా రూపొందిస్తామని డిజిటల్ కనెక్షన్ ప్రకటించింది. డిజిటల్ కనెక్షన్ డేటా సెంటర్లు సీమ్‌లెస్ AI వర్క్లోడ్లకు ప్రత్యేకంగా రూపొందిస్తారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గతంలో డిజిటల్ ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టినట్లుగా ప్రకటించారు. ఆ క్రమంలో ఇతర కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. AI, క్లౌడ్ సర్వీస్‌ల పెరుగుదలతో డేటా సెంటర్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ ఇన్వెస్ట్మెంట్ దక్షిణాది రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది.