మెగాస్టార్చి చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని కీర్తి సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ అప్పట్లో చాలా వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఫాన్స్ కీర్తిని విపరీతంగా ట్రోల్ చేశారు. గోట్ సినిమాలో విజయ్ వేసిన ఓ స్టెప్ ని కీర్తికి ట్యాగ్ చేస్తూ ‘బెస్ట్ డ్యాన్సర్’ అంటూ సెటైర్లు వేశారు. తాజాగా ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించింది. బాధపడ్డవారికీ సారీ చెబుతూనే ఇప్పటికీ తన స్టేట్మెంట్ కి కట్టుబడి వున్నట్లుగా రియాక్ట్ అయ్యింది.
”చిరంజీవి గారు, విజయ్.. ఇద్దరూ లెజెండ్స్. నేను విజయ్ సినిమాలు ఎక్కువగా చూశాను. విజయ్ నాకు బెస్ట్ డ్యాన్సర్ అనిపించారు. అదే చెప్పాను. అది నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని చెప్పే స్వేఛ్చ నాకు వుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా చెప్పాను. ఆయన నా నిజాయితీని ప్రశంసించారు.అయితే కొందరు హార్ట్ అయ్యారు. సారీ. అది నా దురదృష్టం’ అని చెప్పుకొచ్చింది కీర్తి.
మొత్తానికి ఈ విషయంలో బాధపడ్డ ఫ్యాన్స్ కి సారీ చెబుతూనే ఇప్పటికీ తన అభిప్రాయంలో మార్పు లేదని స్పష్టం చేసింది కీర్తి. ఆమె నటించిన రివాల్వర్ రీటా 28న రిలీజ్ అవుతుంది. ఇదొక డార్క్ కామెడీ. కీర్తికి కొన్నాళ్ళుగా సరైన సినిమాలు లేవు. తనే లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.