కాంత సినిమా నటుడిగా దుల్కర్ కి మంచి పేరు తీసుకొచ్చింది కానీ బాక్సాఫీసు రిజల్ట్ బాలేదు. ఇప్పుడా ఫలితం నుంచి బయటికి వచ్చిన తన కొత్త సినిమా ప్రచారంపై దృష్టి పెట్టాడు దుల్కర్. ప్రస్తుతం నహాస్ హిధాయత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఒరిజినల్ గా మలయాళం సినిమా ఇది. తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి “I’M GAME” అనే టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ షూట్ వేసుకున్న దుల్కర్ రక్తంతో తడిసిన చేతితో గన్ పట్టుకుని కనిపించడం సినిమాలో యాక్షన్ డోస్ ని సూచిస్తోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరీవ్ యాక్షన్ కొరియోగ్రాఫర్.
దుల్కర్ కి మంచి విజయాలు వున్నాయి. అయితే ఆయన యాక్షన్ సినిమాలు చేసిన ప్రతిసారి నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. కొన్నాళ్ళ క్రితం ‘కింగ్ ఆఫ్ కొత్త’అనే యాక్షన్ సినిమా చేశాడు. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ డిజాస్టర్ అయ్యింది. ఈసారి యాక్షన్ ఆయనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.