పులివెందుల నియోజవకర్గంలో వైసీపీ పరిస్థితి రాను రాను ఇబ్బందికరంగా మారుతోంది. జడ్పీటీసీ ఎన్నికలో డిపాజిట్ పోవడంతో చాలా మంది వైసీపీ క్యాడర్ మానసిక స్థైర్యం దెబ్బతిన్నది. తాజాగా వేంపల్లె మండలంలో పెద్ద ఎత్తున మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. బీటెక్ రవి నేతృత్వంలో ఆ కుటుంబాలు ఏ మాత్రం భయపడకుండా.. టీడీపీ కండువా కప్పుకున్నాయి. నిజానికి వీరంతా జగన్ ఓటు బ్యాంక్ . వైసీపీకి తప్ప మరొకరికి ఓటు వేసి ఉండరు. వారు ఇతర పార్టీల్లో చేరాలి అన్న ఆలోచన కూా ఎప్పుడూ వచ్చి ఉండేది కాదేమో..కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
వైఎస్ చనిపోయేవరకూ .. పులివెందులపై ఆ కుటుంబం పట్టు ఎవరూ ఊహించనంతగా ఉండేది. కానీ జగన్ రెడ్డి ఎప్పుడు కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకున్నారో అప్పట్నుంచే అంతా కరిగిపోవడం ప్రారంభించింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పులివెందుల ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. పార్టీ నేతలు అని చెప్పుకున్న వారికి ఎన్నికల ముందు కొంత డబ్బు ఇచ్చారు. మిగిలిన ఐదేళ్ల కాలంోల అసలు పట్టించుకోలేదు. దీంతో ప్రజల్లోనూ అసంతృప్తి ప్రారంభమయింది.
ఇప్పటి వరకూ వైఎస్ కుటుంబానికి అధికారం లేనప్పుడు కూడా వీరెవరూ పార్టీ మారలేదు.. ఇప్పుడు మాత్రమే మారుతున్నారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని అంటున్ారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో మెజార్టీ టీడీపీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మెజార్టీ తగ్గింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అసలు పోటీ చేయకుండా వైసీపీ బహిష్కరించినా ఆశ్చర్యం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.