ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఓ చారిటీ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆయన ప్రత్యర్థి టీమ్‌కు కెప్టెన్ ఎవరో కాదు.. సీఎం రేవంత్ రెడ్డి. 14 సంవత్సరాల కిందట ఓ సారి మెస్సీ ఇండియాకు వచ్చారు. ఇప్పుడు మరోసారి వస్తున్నారు. GOAT ఇండియా టూర్ 2025 పేరిట డిసెంబర్ 13 నుంచి 15 వరకు నాలుగు నగరాల్లో ఈ టూర్ జరగనుంది.
డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సీఎం తన జట్టుతో కలిసి మెస్సీ టీమ్‌తో పోటీపడనున్నారు. ఆర్ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగుతారు. సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ రేవంత్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫోటోలు, వీడియోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. స్వయంగా సీఎంవో సోషల్ మీడియా హ్యాండిల్ కూడా .. రేవంత్ ఫుల్ బాల్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డికి పుట్ బాల్ ఇష్టమైన క్రీడ. గతంలో కూడా పలు మైదానాల్లో మిత్రులు, విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. మంచి ఫిట్ నెస్‌తో ఉండే రేవంత్ లెజెండ్ మెస్సీతో కలిసి ఆడే అవకాశం రావడంతో మరింత చురుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రచారం అతిగా చేసుకుంటే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ మ్యాచ్ ను.. తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్ ను ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.