ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారుల్లో అత్యంత సీనియర్లలో ఒకరు అయిన పీవీ సునీల్ వ్యవహారం అధికారవర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది. అయినా అడ్డగోలు తప్పు చేసి కులం చాటున దాక్కుని రక్షణ పొందాలని అనుకుంటున్నారు. వైసీపీ నేతలను అడ్డుగా పెట్టుకుని వారితో తనకు మద్దతుగా మాట్లాడించుకుని ..తాను రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ ఈ ప్రవర్తనను ఏ మాత్రం క్షమించవు. అన్నీ తెలిసినా ఆయన మాత్రం ఎప్పటికప్పుడు గీత దాటిపోతున్నారు.
సివిల్ సర్వీస్ అధికారులకు కఠిన నియమాలు
సివిల్ సర్వీస్ అధికారులకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే బాస్. అయితే ఆ ప్రభుత్వం చెప్పినట్లుగా చేసినా రూల్స్ ప్రకారమే.. రాజ్యంగం ప్రకారమే ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అయినా రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ఆ ప్రభుత్వం తనకు నచ్చలేదని.. గత ప్రభుత్వమే బాగుందని అనుకుంటే ఆయన సర్వీసులో ఉండటానికి అనర్హుడు. స్వచ్చందంగా రాజీనామా చేసి వైదొగలగాలి. కానీ పదే పదే నిబంధనల ఉల్లంఘిస్తూ ఏమైనా అంటే కులం పక్కన దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసిన తప్పులు కళ్ల ముందే ఉన్నాయి. ఆయినా ఆయనపై కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ దళిత అధికారులకు వేధింపులు అని వైసీపీ ఎమ్మెల్యేలతో పోస్టులు పెట్టిస్తూంటారు. తెలంగాణలో రాజకీయ నేతగా మారిన వారితో మద్దతుగా ప్రకటనలు పెట్టించుకుంటూ ఉంటారు.
అన్ని నిబంధనలు ఉల్లంఘించిన పీవీ సునీల్
తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో కాపులు, దళితుల గురించి చెప్పి.. ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నట్లుగా మాట్లాడారు. దాంతో ఆయన పై చర్య తీసుకోవడానికి కావాల్సినంత ఆధారాలు లభించాయి. గతంతో దేశానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రికార్డుల్లో ఉన్నాయి. అలాగే మత మార్పిడి సంస్థను నడుపుతున్న వైనం కూడా రికార్డుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆయన సర్వీసును టెర్మినెట్ చేయవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం వేచి చూస్తోంది. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఆయన మరింత పద్దతిగాఉండాలి. కానీ అన్ని హద్దులు దాటిపోతున్నారు.
రాజకీయాల్లోకి రావడమే పరిష్కారం
పీవీ సునీల్ మాటలన్నీ రాజకీయ నాయకులలానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇస్తానంటే.. వద్దని దళిత వాడల్ని పంచాయతీల్ని చేయమని అడిగారట. ఆయన చేస్తానన్నారట. ఎన్నికల సమయంలో బహిరంగంగా వైసీపీకి మద్దతు పలికిన ఐపీఎస్ అధికారి ఈయన. ఇలాంటి వారు అటు తాము కూర్చున్న సివిల్ సర్వీస్ అనే వ్యవస్థను బలహీనపరుస్తూ ఇలా బరితెగించి వ్యవహరిస్తూండటం ప్రమాదకరం. ఆయన వెంటనే వీఆర్ఎస్ తీసుకుని.. రాజకీయాల్లోకి ప్రవేశించడం అత్యుత్తమం. జగన్నోహన్ రెడ్డి పార్టీలో చేరి తన ఆశయాలు కోసం కృషి చేయాలి. కానీ ఐపీఎస్ వ్యవస్థలో ఇలాంటి వాళ్లు కూడా ఉండేవాళ్లు అని చెప్పుకునేలా చేసుకోకూడదు. అది దేశ అధికార యంత్రాంగానికి పిల్లర్ లాంటి సివిల్ సర్వీస్ వ్యవస్థకు కళంకం.
