సంక్రాంతి తెలుగు సినిమాలకి హాట్ కేక్ లాంటి సీజన్. కొత్త సినిమాలు వరసకట్టేస్తాయి. ఈసారి జాబితా పెద్దదే. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పొలిశెట్టి, తమిళ్ నుంచి విజయ్, శివకార్తికేయన్.. మామూలు వుండదు ఈసారి సందడి. ఇప్పుడు శర్వానంద్ కూడా రేసులో దిగాడు.
శర్వా’నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. సామజజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం. అందుకే పండగే సరైన సీజన్ ని వచ్చేస్తున్నారు. శర్వాకి పండుగ సీజన్ పాజిటివ్ సెంటిమెంట్ వుంది. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా లాంటి హిట్స్ వున్నాయి. ఇప్పుడు నారినారి రెడీ చేస్తున్నాడు.
నిజానికి ఎప్పటినుంచి పండగ రిలీజ్ అనుకుంటున్నారు. కానీ అనౌన్స్ చేయడానికి ముందువెనుక అయ్యారు. ఇప్పుడు టైం లాక్ చేశారు. పండగ రేసులో వున్న సినిమాల్లో ఇప్పటివరకూ ఈ సినిమాకి ప్రమోషన్స్ లో హడావిడి ఇంకా కనిపించడం లేదు. బైకర్ డిసెంబర్ లో రావాలని కొన్నిరోజులు ఆ ప్రమోషన్స్ చేశారు. కానీ సినిమా వాయిదా పడింది. ఇప్పుడ నెల రోజులు చేతిలో వున్నాయి. ఈ సమయాన్ని సరిగ్గా వాడుకొని గట్టిగా ప్రమోట్ చేస్తే బజ్ క్రియేట్ చేయొచ్చు. త్వరలోనే టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్ బాగుండి, పబ్లిసిటీ కాస్త గట్టిగా చేసుకొంటే ఫలితం కనిపించే ఛాన్సుంది.
