ఎంసెట్ పరీక్షల నిర్వహణపై భిన్నాభిప్రాయాలు

ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ తెలంగాణా ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగించే విషయమే. దానిలో కొందరు మంత్రులు, తెరాస నేతలు, అధికారుల పాత్ర కూడా ఉందని మీడియాలో వస్తున్న వార్తల వలన ఇంకా అప్రదిష్ట, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని కొందరు, వద్దని..దాని వలన వేలాది మంది విద్యార్ధులు నష్టపోతారని మరికొందరు చేస్తున్న వాదనలతో అయోమయ పరిస్థితి నెలకొని ఉంది.

ఒకవేళ ఎంసెట్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలనుకొంటే, ఇదివరకు పరీక్షలు వ్రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్ధులు నష్టపోతారు. నిర్వహించకుంటే, ఇంత పెద్ద తప్పు జరిగిన తరువాత కూడా ఏమీ జరుగనట్లుగా మెడికల్ కాలేజీలలో సీట్లు భర్తీ చేస్తే ఇంకా విమర్శలు, న్యాయపరమైన చిక్కులు, ప్రభుత్వానికి ఇంకా అప్రదిష్ట కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎంసెట్-2ని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. కానీ నిర్ణయం ప్రకటించే ముందు న్యాయ నిపుణులని మరొకమారు సంప్రదించాలని నిర్ణయించుకొన్నారు. మళ్ళీ భవిష్యత్ లో మరెన్నడూ ఈవిధంగా జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రుల్ని, అధికారులని ఆదేశించారు. సోమవారం దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఎంసెట్-3 నిర్వహించడం ఖాయంగానే కనిపిస్తోంది కనుక విద్యార్ధులందరూ మళ్ళీ ఆ పరీక్షలకి సిద్దం కావడం మంచిది.

రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంసెట్-3ని సమర్ధంగా నిర్వహించవచ్చు. ఆ తరువాత పరిస్థితులు చక్కబడవచ్చు. కానీ ప్రభుత్వ అసమర్ధత లేదా అశ్రద్ధ లేదా కొందరి అవినీతి కారణంగా ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట ఏర్పడింది. విద్యార్ధులకి చాలా నష్టం జరిగింది. కనుక ఒకవేళ మంత్రులు, నేతలు, అధికారులు ఎవరైనా దీనికి బాధ్యులని గుర్తించినట్లయితే వారిని సస్పెండ్ చేసి, అదే వారికి విధించిన గొప్ప శిక్ష అని చేతులు దులుపుకోకుండా, ఇటువంటి నేరానికి పాల్పడినందుకు అందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టి చట్ట ప్రకారం వారికి శిక్షలు పడేలా చేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వం దాని చిత్తశుద్ధి చాటుకొన్నట్లవుతుంది. దీనికి బాధ్యులైన వారు ఎంత పెద్ద వారైనప్పటికీ వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. దానిని ఆచరణలో పెడితే మళ్ళీ ఇటువంటి నేరాలు చేసేందుకు ఎవరూ సాహసించరు. అప్పుడే తెరాస ప్రభుత్వంపై పడిన ఈ మచ్చ తొలగిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close