త్రివిక్ర‌మ్‌కి క‌థ‌ల క‌రువొచ్చిందా?

మాట‌ల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్ర‌మ్‌… ద‌ర్శ‌కుడిగా త‌న విశ్వ‌రూపాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు చూపిస్తూనేఉన్నాడు. అయితే… త్రివిక్ర‌మ్ అభిమానులంతా ద‌ర్శ‌కుడి కంటే, ర‌చ‌యిత‌గానే ఎక్కువ మార్కులేస్తారు. ఇప్పుడు ఆ ర‌చ‌యిత‌కే క‌రువొచ్చి ప‌డింది. అ.ఆ కోసం తొలిసారి బ‌య‌ట క‌థ వాడుకొన్నాడు త్రివిక్ర‌మ్‌. ఇప్పుడు మ‌రోసారి క‌థ‌ని అప్పు తీసుకొంటున్న‌ట్టు టాక్‌. సెప్టెంబ‌రులో ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే… ఈ క‌థ త్రివిక్ర‌మ్‌ది కాద‌ట‌. ప‌వ‌న్ సొంతంగా రాసుకొన్న క‌థ‌ట‌. దానికి మార్పులు, చేర్పులూచేసి త్రివిక్ర‌మ్ త‌న స్టైల్‌కి అడాప్ట్ చేసుకొంటున్నాడ‌న్న‌మాట‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌కీ ప‌వ‌న్ ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేశాడు. ఆసినిమా తేలిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడ‌న్న‌మాట‌. డాలీ, బాబీ లాంటి ద‌ర్శ‌కుల‌కు మాట సాయ‌మో, క‌థ సాయమో చేయొచ్చు.మాట‌ల మాంత్రికుడికీ అంతేనా.?? త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రైనా… ప‌వ‌న్ ఈ త‌ర‌హా జోక్యం త‌గ్గించుకొంటే బాగుంటుందేమో? లేదంటే… స‌ర్దార్ లాంటి డిజాస్ట‌ర్లు త‌గులుతూనే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close