హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఎస్.ఎస్.రాజమౌళికి మధ్య మంచి అనుబంధం వుంది. బాహుబలి, ట్రిపులార్ సినిమాలని తానూ ఎంజాయ్ చేశానని పలు సందర్భాల్లో కామెరూన్ స్వయంగా చెప్పారు. తాజాగా జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రాన్ని రాజమౌళి సహా కొంత మంది సినీ ప్రముఖులకు చూపించారు. అనంతరం జేమ్స్ కామెరూన్, రాజమౌళి వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు.
‘‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ అందరికంటే ముందు చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మూవీలో విజువల్స్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం. మూవీ చూస్తున్నప్పుడు థియేటర్లో చిన్న పిల్లాడిలా అయిపోయాను. అవతార్ ఫ్రాంఛైజీ సిల్వర్ స్క్రీన్ కి ఒక బెంచ్ మార్క్’’ అని ప్రసంశించారు జక్కన్న.
కామెరూన్ కూడా కూడా ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. వారణాసి షూటింగ్ చూడాలని వుందని వచ్చి చూడవచ్చాఅని అడిగారు. మీరు వస్తే మా ‘వారణాసి’ టీమ్ మాత్రమే కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ థ్రిల్ అవుతుంది’ అని రాజమౌళి బదులిచ్చారు. నిజంగా కెమరూన్ వారణాసి షూటింగ్ వీక్షించడానికి వస్తే మాత్రం సినిమాకి అదొక గ్లోబల్ ఎట్రాక్షన్ అవుతుంది.
