వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాదు ఇక ముందు వారికి చాన్స్ లేకుండా చేసేలా చేస్తున్న కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై వైసీపీకి చాలా కోపం వస్తోంది. ఎంతగా అంటే ఆమెను టార్గెట్ చేసుకుని లేనిపోని వార్తాలన్నీ రాసుకుని.. తప్పుడు ప్రచారాలు చేసేంత. కానీ ఆమె ఇలాంటి వాటన్నింటినీ ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతి దానికి సమాధానం ఇస్తున్నారు.
వైసీపీ హయాంలో మూలన పడిన అంబులెన్స్ లను చూపించి తమ మీడియాలో కథనాలు రాయించారు వైసీపీ నేతలు. నిజానికి అవి మూలనపడినవే. వైసీపీ హయాంలోనే అవి అక్కడున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు కొత్త అంబులెన్స్ లు కడపకు వచ్చాయి. అవి నడుస్తున్నాయి. కానీ ఆ విషయం చెప్పలేదు. దీంతో ఎమ్మెల్యే మీడియాను తీసుకెళ్లి చూపించారు. నిజాలన్నీ బయటపెట్టారు. అవన్నీ అక్కడి రిపోర్టర్లకు తెలుసు. కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి చూపించారు.
ఇక సిటీలో ఎక్కడా అరాచకాలు, అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. ప్రస్తుతం కార్పొరేషన్ వైసీపీ చేతుల్లో ఉంది. సీన్ కెమెరాలు పెట్టిస్తే ఎక్కడ తమ ఘోరాలు బయటకు వస్తాయని అనుకుంటున్నారో కానీ ఎక్కడిక్కడ అడ్డం పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే కడపలోని వివిధ వర్గాల నుంచి విరాళాలుగా సేకరించి సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటున్నారు. దీన్ని అడ్డుకోవడానికి వసూళ్లంటూ ఆరోపణలు చేస్తున్నారు.
కడపలో చాలా సమస్యలకు ఎమ్మెల్యే పరిష్కారం చూపుతున్నారు. ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే ఇక భవిష్యత్ లో తమను పట్టించుకోరని.. వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే తప్పుడు ప్రచారాలతో విరుచుకుపడుతున్నారు. అయినా వాటన్నింటినీ ఆమె ఎదుర్కొంటున్నారు.
