జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కెంజుట్సులో ఫిఫ్త్ డాన్ సాధించినందుకు ప్రధాని మోదీ .. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అభినందించారు. ఈ మేరకు పవన్ కు ప్రత్యేక సందేశం పంపించారు. రాజకీయాలతో పాటు సినిమా కెరీర్‌తో తీరిక లేకుండా ఉంటూ కూడా కఠినమైన మార్షల్ ఆర్ట్స్‌ను క్రమశిక్షణతో అభ్యసించడం పవన్ కళ్యాణ్ నిబద్ధతకు నిదర్శనమని మోదీ తన అభినందన సందేశంలో ప్రసంసించారు.
పవన్ కళ్యాణ్ యువతరానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారని.. వృత్తిపరమైన బాధ్యతలు ఎన్ని ఉన్నా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏదీ అడ్డంకి కాదని పవన్ నిరూపించారని ప్రధాని ప్రశంసించారు. ద్ధ కళలకు కేవలం శారీరక బలమే కాకుండా మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరమని.. పవన్ అనుసరిస్తున్న ఈ సంప్రదాయం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని అభినందించారు. ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల లక్ష్యాలను పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు నిజం చేస్తున్నారన్ారు.
ప్రధాని పంపిన లేఖ తనకు దక్కిన గొప్ప గౌరవమని పవన్ కల్యాణ్ స్పందించారు. యుద్ధకళలు తన జీవిత ప్రయాణంలో అంతర్భాగమని, ఇవి తనకు ఒత్తిడిని తట్టుకునే శక్తిని, ఏకాగ్రతను ఇచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన సమాజం కోసం ప్రధాని చేస్తున్న కృషిలో తాను కూడా భాగస్వామినవుతానన్నారు.
జపనీస్ సమురాయ్ కత్తి సాము కళ కెంజుట్సు లో పవన్ కళ్యాణ్ ‘ఫిఫ్త్ డాన్’ బ్లాక్ బెల్ట్ హోదాను అందుకున్నారు. యుద్ధ కళల్లో కేవలం శారీరక కదలికలే కాకుండా, మానసిక ఏకాగ్రత, ఆత్మరక్షణలో పరిపూర్ణత సాధించిన వారికి మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది.
