స్టాక్ మార్కెట్‌లో బాహుబలి: పబ్లిక్ఇష్యూకి రానున్న పార్ట్ 2

హైదరాబాద్: బాహుబలి మొదటిభాగం నాలుగు వెర్షన్‌లలో కలిపి రు.500 కోట్లను వసూలుచేయడంతో రెండోభాగంగురించి దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రెండో భాగం మరో కొత్త రికార్డ్ సృష్టించబోతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది రానున్న బాహుబలి రెండో భాగానికి నిధులను స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించాలని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని యోచిస్తున్నారు. ఈ చిత్రం రెండోభాగంలో పెట్టుబడి పెడతామంటూ అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు – శోభు, ప్రసాద్‌లకు ఊపిరి సలపకుండా ఆఫర్‌లు ఇస్తున్నాయట. దీనితో వారిద్దరూ రెండోభాగం ప్రాజెక్ట్‌ నిధులకోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్ళే విషయమై సమాలోచనలు జరుపుతున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. దర్శకుడు రాజమౌళిని ఈ విషయమై సంప్రదించగా, చిత్రం వ్యాపార సంబంధిత విషయాలపై తాను దృష్టి పెట్టనని చెబుతూనే, బాహుబలి-2 ప్రాజెక్టుపై అనేకసంస్థలు ఆసక్తి చూపుతున్నమాట నిజమేనని చెప్పారట. ఇదే నిజమైతే ఇలా పబ్లిక్ ఇష్యూద్వారా నిధులు సేకరించటమనేది బాహుబలి సృష్టించే మరో కొత్త రికార్డ్ అవుతుంది. ఇప్పటికే దేశంలోపల(విదేశాల కలెక్షన్‌లు కాకుండా) రు.500 కోట్లు(నాలుగు వెర్షన్‌లద్వారా) వసూలుచేసి పీకే చిత్రం రికార్డ్‌ను(రు.440 కోట్లు) అధిగమించింది. ముందుముందు మరెన్ని రికార్డులు సృష్టించనుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close