దళితుల్లో బిజెపి పై వ్యతిరేకత!

మత చాందసులు ఉత్తరప్రదేశ్ దాద్రి లో గోవు మాసం తిన్నాడన్న అభియోగంతో ఒక ముస్లింను చంపేసిన గాయం తగ్గుముఖం పట్టకముందే ఇదే అభియోగం మీద గుజరాత్ లోని ఉనా పట్టణంలో జూలై 11న నలుగురు దళితుల కాళ్లూ చేతులూ కట్టేసి అర్ధనగ్నంగా నిలబెట్టి దారుణంగా వారిని హింసించారు. ఈ సంఘటన రాష్ట్రంలో దళితులందరినీ సంఘటితం చేస్తోంది.

దాడికి వ్యతిరేకంగా అహ్మదాబాద్ నుంచి నెల 5న దాడి జరిగిన ఉనా పట్టణానికి పాదయాత్ర నిర్వహించేందుకు దళితులు సిద్ధమవుతున్నారు. దళితులపై దాడి చేసిన వారిని ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీ యాక్ట్(పాసా) కింద అరెస్టు చేసే వరకు ఆందోళనలు కొనసాగించాలని దళిత నేతలు నిర్ణయించారు.

దాడుల అంశంతో పాటు పలు డిమాండ్లను దళిత నేతలు సర్కారు ముందు ఉంచుతున్నారు. గోరక్షక దళాలపై చర్యలు తీసుకునే వరకూ పశువుల కళేబరాలను ముట్టుకోబోమని, పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, 6వ పే కమిషన్ సిఫారసుల మేరకు జీతాలివ్వాలని కూడా వారు కోరుతున్నారు.

గుజరాత్ లోని 13 ఎస్సీ నియోజకవర్గాలకు 10 పదిచోట్ల బీజేపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరెవ్వరూ ప్రభుత్వాన్ని దళితుల ఆగ్రహం నుంచి అడ్డుకునే పరిస్థితి లేదు. గతవారం బీజేపీ దళిత ఎంపీ కిరీట్ సోలంకీ, ఎమ్మెల్యే రజనీకాంత పటేల్ నివాసాలను దళితులు ముట్టడించారు.

అసహనపరుల చర్యలవల్ల అంతకు ముందు దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పైకూడా ఇలాంటి దుమారాన్నే రేపాయి. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, పద్మా అవార్డులను ఎందరో ప్రముఖులు వాపసు ఇచ్చేశారు. దేశానికి చెందిన మేధావులు తమ అవార్డులను వాపసు ఇచ్చేస్తూ చేసిన మౌనపోరాటం దేశవిదేశాల్లో భారత్ పరువు ప్రతిష్టల్ని దిగజార్చింది. దేశంలో స్వేచ్ఛగా ఆలోచించలేని వాతావరణాన్ని నిరసిస్తూ ఎంతో మంది సాహితీవేత్తలు తమకు అందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేసిన వైనం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తలవంచుకునేలా చేసింది.

గుజరాత్ లోని దళితుల ఆందోళనకు అధికశాతం ముస్లింలు మద్దతిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి బీజేపీ పెద్దలకు ఆందోళన కలిగిస్తోంది.

వీటిని చెదురు మదురు సంఘటనలగానో, కాకతాళీయాలుగానో భావించే వీలు లేదు. హిందూభావజాలం తీవ్రంగా వున్న పరివారం కేంద్రంలో బిజెపి పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నందున ఇప్పుడే హిందూ అనుకూల రాజ్యం స్థాపించాలని భావిస్తున్నారు.

విశ్వహిందూపరిషత్, ఆర్ఎస్ఎస్‌లు దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌లు కూడా సిద్ధం చేస్తున్నాయన్న ఆరోపణలు వున్నాయి. అందుకు అనుగుణంగానే బిజెపికి చెందిన ఎంపిలు విచ్చల విడిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బిజెపి నాయకులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే ఇప్పటికే ఆందోళనగా ఉన్న హిందూయేతర మతాల వారు మరింత వత్తిడికి గురికావచ్చునని నిఘావర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయని కూడా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close