చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు అంటూ తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా.. సాక్ష్యాలు చూపించమంటే రకరకాల పిటిషన్లతో విచారణ జరగకుండా కోర్టులపై దండయాత్ర చేస్తున్నారు ఆళ్ల. చివరికి ఆయన ఏసీబీ కోర్టు నుంచి ప్రజా ప్రతినిధుల కోర్టుకు కూడా మార్చాలని పిటిషన్ వేశారు. కోర్టుకు హాజరై సాక్ష్యాలు సమర్పించాలని దర్యాప్తు అధికారులు నోటీసులు పంపితే.. వాటిని చూపించడానికి ఆయన దగ్గర ఏమీ లేక కోర్టుల్ని కన్ ఫ్యూజ్ చేయడానికి పిటిషన్ల పద్దతిని ఎంచుకున్నారు.
ఈ పిటిషన్లను పరిష్కరించకుండా తీర్పు ఇవ్వరని ఆయన ఉద్దేశం. విచిత్రం ఏమిటంటే.. ఆయన కోర్టును కూడా మార్చాలని అడుగుతున్నారు. ఏసీబీ కోర్టులో విచారణ జరగకూడదు. ప్రజాప్రతినిధులుగా అన్నందుకు ప్రజా ప్రతినిధుల కోర్టుకు ఆ కేసును తరలించాలట. మరి జగన్ రెడ్డి హయాంలో పెట్టిన ఈ తప్పుడు కేసును.. ఏసీబీ కోర్టులోనే ఎందుకు విచారించారు?. ఆయన అప్పట్లో ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. తన ఫిర్యాదు ప్రజా ప్రతినిధుల కోర్టులోనే విచారణ జరగాలని ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు?. ఆయనకు కోర్టు ప్రొసీజర్లు తెలుసు..కేవలం న్యాయపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడానికే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారు.
ఈ తరహా పిటిషన్లు మరో నాలుగు వేశారు. ఆయన ఉద్దేశం చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు కోర్టులో నలుగుతూ ఉండాలనే. అవి కొట్టివేతకు గురి కాకూడదనే. అధికారం ఉందని తప్పుడు కేసులు.. సాక్ష్యాల్లేకుండా పెట్టి ఇప్పుడు వాటిపై ఆధారాలు చూపించకుండా.. రకరకాల పిటిషన్లు వేసే ఇలాంటి వారికి వ్యవస్థనే సరైన బుద్ది చెప్పాల్సి ఉంది.


