వైసీపీలో మావిగన్ ఫ్లెక్సీల పోటీలు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి మావిగన్ అనే రాజధానిని కనిపెట్టిన తర్వాత వైసీపీ నేతలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరూ నవ్వుతూంటే వారు ఏడవాల్సినపరిస్తితి వచ్చింది. అయితే జగన్ రెడ్డి నవ్వే వాడు నవ్వనీ.. మన పిచ్చిని మనం కంటిన్యూ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి.. నేతలందరికీ.. మావిగన్ ను స్వాగతిస్తూ ఫ్లెక్సీలు పెట్టాలని ఆ ఫ్లెక్సీలను ఫోటోలు తీసిపంపించి తమ నిబద్ధతకు మార్కులేయించుకోవాలని పోటీలుపెట్టారు. అయితే మిగత చోట్ల సంగతేమో కానీ ఓడిపోయాక.. జగన్ రెడ్డి కి తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫ్లెక్సీలు కట్టే దిక్కు లేకుండాపోయింది. ఇప్పుడు ఈ మావిగన్ పోటీలు పెట్టడంతో కారుమూరి వెంకటరెడ్డి నుంచి అలాంటి ఫ్లెక్సీ బ్యాచ్ అంతా.. రంగంలోకి దిగిపోయారు. కావాలి జగన్.. రావాలి మావిగన్ అంటూ.. ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు.
అసలు మావిగన్ అంటే ఏమిటో తెలియకపోయినా, అధినేత చెప్పారు కాబట్టి అది ఏదో అద్భుతమైన రాజధాని లేదా పారిశ్రామిక ప్రాంతం అన్నట్లుగా నేతలు బిల్డప్ ఇస్తున్నారు. తప్పును సరిదిద్దుకోవడం పక్కన పెట్టి, ఆ తప్పునే గొప్పగా ప్రచారం చేసుకోవడం ఒక్క జగన్ రెడ్డికే సాధ్యం అని ఎద్దేవా చేసేవాళ్లు ఉన్నా తగ్గడంలేదు. వైసీపీ నేతలు పడుతున్న ఈ మావిగన్ కష్టాలు చూస్తుంటే పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేసత్ున్నారు. నవ్వుల పాలు అవుతున్నామని తెలిసినా, మార్కుల కోసం పడరాని పాట్లు పడుతూ ఫ్లెక్సీలు దింపుతున్న నేతల అవస్థలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ ఫ్లెక్సీల ఫోటోలను తాడేపల్లిలో జనగ్ రెడ్డికి కనిపించేలా పెట్టి తమ సీటును లేదా పదవిని పదిలం చేసుకోవాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఒక తప్పుడు వ్యూహాన్ని ఒక ఉద్యమంగా మార్చేయడం వైసీపీ మార్క్ రాజకీయానికే చెల్లింది. మావిగన్ పుణ్యమా అని ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్‌లకు మాత్రం మళ్ళీ మంచి రోజులు వచ్చాయని జోకులు పేలుతున్నాయి.
