బీజేపీ అధిష్టానాన్ని ధిక్కరించిన నాగం జనార్దనరెడ్డి

హైదరాబాద్: నాగం జనార్దనరెడ్డి భారతీయజనతాపార్టీని వీడబోతున్నారని ఇవాళ స్పష్టమయింది. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడటానికంటూ మరో బీజేపీ నేత యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఇవాళ ప్రారంభించిన ‘తెలంగాణ బచావో మిషన్‌’ వేదికకు పార్టీ నాయకత్వంనుంచి అనుమతి లేదని రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.

టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణ బచావో మిషన్ పోరాటం చేస్తుందని నాగం చెప్పారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, కరవు, ఆత్మహత్యలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ చీప్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులందరూ డమ్మీలయ్యారన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవటం తప్పుకాదా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

తెలుగుదేశంనుంచి బయటకొచ్చిన నాగం ఎన్నికలముందు బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఆయన ఇమడలేకపోతున్నారు. కొంతకాలంగా బీజేపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన సమయంలో వెంకయ్యనాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన మరో బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాసరెడ్డికికూడా పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించటంలేదు. దీనితో వీరిద్దరూ కలిసి ఇవాళ తెలంగాణ బచావో మిషన్‌ను ప్రారంభించారు. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close