కాంగ్రెస్ ఎంపీలకు, నీకు తేడా ఏంటి పవన్?

వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్‌ల స్పీచ్‌లన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేలా చేసుకోవాలంటే ఏం చేయాలి? నరేంద్రమోడీ పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి దారుణంగా మోసం చేసిన వెంకయ్యనాయుడు, బిజెపి పార్టీ, నరేంద్రమోడీలను విమర్శించాలి. కానీ వీళ్ళు ముగ్గురూ కూడా సీమాంధ్ర ఓటర్ల దృష్టిలో ఎప్పుడో చచ్చిన కాంగ్రెస్ పైన సందర్భం వచ్చినప్పుడల్లా విరుచుకుపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడో చచ్చిన కాంగ్రెస్ పార్టీపైన వీళ్ళు వీర ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఈ రోజు పవన్ చేసింది కూడా అదే. చాలా ఆవేశపడ్డాడు. ఆవేధన వ్యక్తం చేశాడు. కానీ పవన్ మాట్లాడిన మాటల్లో మాత్రం ఫోర్స్ ఎక్కడా లేదు. కంటెంట్ విషయంలో పవన్ చాలా క్లియర్‌గా ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్రమోడీని తిట్టకూడదు. ప్రత్యేక హోదా విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్న, కేంద్రప్రభుత్వాన్ని కనీస స్థాయిలో కూడా నిలదీయలేకపోతున్న చంద్రబాబును అస్సలు ఏమీ అనకూడదు. ఈ రెండు విషయాలలోనూ పవన్ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే అంత ఆవేశంలో కూడా చంద్రబాబు, మోడీలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఎన్నికలయిపోయిన దగ్గర నుంచి జనసేనను భజన సేన అని విమర్శిస్తున్న విమర్శకుల మాటలను మరోసారి నిజం చేశాడు. కానీ ఆ విషయం తన అభిమానులకు అర్థం కాకూడదు, సాధారణ ప్రజలకు అస్సలు అర్థం కాకూడదు అనుకున్నట్టున్నాడు. అందుకే సినిమాల్లో కూడా ఎప్పుడూ యాక్ట్ చేయనంత స్థాయిలో నటించేశాడు. ఆవేశం, ఆగ్రహం, ఆవేధనను అద్బుతంగా ప్రదర్శించాడు. తనలో బీభత్సమైన యాక్టింగ్ టాలెంట్ ఉందని డైరెక్టర్స్‌కి హింట్ ఇవ్వడానికి మాత్రమే పవన్ స్పీచ్ ఉపయోగపడింది. అంతకు మించి పవన్ స్పీచ్‌లో కొత్తగా చెప్పింది ఏమీలేదు. కానీ అంతటితో వదిలేస్తే పవన్ కళ్యాణ్ స్థాయి మరింత దిగజారి ఉండేది. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నాడు.

విమర్శకుల వాదనలు మరీ బలంగా ప్రజల్లోకి చేరకుండా ఉండడానికి మాత్రం పవన్ అనౌన్స్ చేసిన ప్రత్యేక హోదా పోరాటం అనే కాన్సెప్ట్ చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేక హోదా కోసం ఎవ్వరు మాట్లాడినా, పోట్లాడినా అభినందించాల్సిందే. పవన్ కళ్యాణ్ కూడా రెండు సంవత్సరాల తర్వాతైనా ప్రత్యేక హోదా కోసం జనంతో కలిసి పదం కలుపుతా అనడం అభినందనీయం. వైఎస్ జగన్, చంద్రబాబులకు పోరాటం చేయడం చేతకాలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్న పవన్ మాటలు సీమాంధ్రులకు మరోసారి ఆశలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు. మాట తప్పను, మడమ తిప్పను అని కూడా చెప్పాడు పవన్. ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్నందుకు మరోసారి కూడా పవన్‌కి అభినందనలు. మోడీకి, బిజెపికి సీమాంధ్ర ప్రజలు ఓటేయడానికి చంద్రబాబు, టిడిపి అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్‌లే ప్రధాన కారణం. బిజెపి అధికారంలోకి వస్తే సీమాంధ్రకు ప్రత్యేక హోదాతో సహా అన్నీ చేస్తుంది అని ప్రజలను నమ్మించినవాళ్ళు వీళ్ళు ముగ్గురే. ఇప్పుడు నరేంద్రమోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టుతో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పోరాటం చేస్తారో, ప్రశ్నిస్తారో….ఏం చేస్తారో కానీ బాధ్యత మాత్రం పవన్, చంద్రబాబులకు ఉంది.

రేపు ప్రత్యేక హోదా పోరాటం పేరుతో జనాల మధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే చచ్చిన పాములాంటి కాంగ్రెస్ పార్టీని మరోసారి చంపేస్తా లాంటి కామెడీ డైలాగులు చెప్పాడంటే మాత్రం హీరో వర్షిప్ కాస్తా….కమెడియన్ ట్యాగ్ కింద మారినా ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. ఈ రోజు కాంగ్రెస్‌ని తిట్టడం వళ్ళ సీమాంధ్రులకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ‘పవర్’లో ఉన్నవాళ్ళతో పోరాడితే అప్పుడు నీ పవర్‌ని కూడా ప్రజలు గుర్తిస్తారు. లేకపోతే మాత్రం కాంగ్రెస్ ఎంపీలకు, నీకూ ఏమీ తేడాలేనట్టే. అందరూ అందరే అనుకోవాల్సి వస్తుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడతానన్న పవన్ మాటలను, చేతలను మీడియా కూడా మరీ ఎక్కువ విమర్శించకుండా ఉంటేనే బాగుంటుందేమో. ఆయన క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బతీస్తే ఆ ప్రభావం పవన్ చేయబోయే పోరాటం పైన పడుతుంది. ప్రత్యేక హోదా కోసం చేస్తానన్న పోరాటం విషయంలో ఈ రోజు ప్రదర్శించినట్టుగానే గొప్ప నటనను ప్రదర్శిస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం పవన్‌ని సీమాంధ్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. అప్పుడు ఒక్క మీడియాకే కాదు, సీమాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి పవన్‌ని విమర్శించే హక్కు ఉంటుంది.

పవన్ పైన, పవన్ పార్టీ పైన వస్తున్న విమర్శలన్నీ అర్థవంతమైనవే. ఆ విమర్శలను కూడా తన హీరోయిజం ప్రదర్శనకోసం వాడుకునే ప్రయత్నం చేశాడు పవన్. అది మాత్రం దారుణం. నేను హీరోని అని చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు కానీ ఆ హీరోయిజం నిజంగా ప్రదర్శించి ఉంటే, చచ్చిన పాముని కాకుండా బలవంతుడ్ని విమర్శించడానికి, ఢీ కొట్టడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ఉంటే బాగుండేది. ప్రత్యేక హోదా కోసం పవన్ చేయబోయే పోరాటంలో అయినా అది కనిపిస్తుందని ఆశిస్తూ…….

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close