పవన్ కళ్యాణ్…అందరివాడా? అందరిలాంటివాడా?

మన రాజకీయ నాయుకులందరూ కూడా ‘అందరివాడు’ అని అనిపించుకోవాలని చాలా చాలా తాపత్రయపడుతూ ఉంటారు. అందుకోసం అన్ని కులాల సభలకు వెళుతూ ఉంటారు. అన్ని మతాల పండగలలోనూ పాల్గొంటూ ఉంటారు. అన్ని కులాల ప్రజలకు రిజర్వేషన్స్ తాయిలాలను ఇస్తూ ఉంటారు. అన్ని మతాల పండుగలప్పుడూ బహుమతులు ఇస్తూ ఉంటారు. కులాల గొడవలు, మతాల గొడవలు మన నాయకులకు చాలా అవసరం. అలాగే ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రధానంగా కారణమయ్యే ఓటర్లను మనవాళ్ళు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటారు. యువత, ఆడబిడ్డలు, అక్కచెల్లెల్లు, రైతులు, కార్మికులు, పేదలు……ఇంకా ఎవరైతే ప్రభుత్వాలపైన, నాయకుల పైన ఆశలు పెట్టుకుని ఉంటారో వాళ్ళందరినీ ఉద్ధరించడానికే వచ్చామని ఊరూరా తిరిగి ఊదరగొడతారు. (కానీ ఏ ఒక్క నాయకుడు కూడా పారిశ్రామికవేత్తల, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడతాం అని ఎన్నికల సభలలో అస్సలు ప్రస్తావించరు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకులందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేది వాళ్ళకే అన్నమాట నిఖార్సైన నిజం.) ఎన్నికలలో గెలవడం, కోసం పదవుల కోసం, సంపాదన కోసం కక్కుర్రిపడే మన నాయకుల దరిద్రపు నైజం ఇది. మాటల విషయం పక్కన పెడితే చేతలలో మాత్రం అందరి టార్గెట్ ఒక్కటే. వాళ్ళ సొంత వర్గంలో బలం పెంచుకోవడం, అన్ని వర్గాల ఓటర్లను…ముఖ్యంగా వాళ్ళ పార్టీకి బాగా పట్టున్న వర్గాల ప్రజల ఆదరణను కోల్పోకుండా ఇంకా బాగా పట్టును పెంచుకోవడం….ఇది మన నాయకులు చేస్తున్న రాజకీయం. మరి పవన్ ఎలాంటి వాడు? నాకు పదవులపై వ్యామోహం లేదు. అధికారంపై వ్యామోహం లేదు. డబ్బుపై వ్యామోహం లేదు అన్న పవన్ కళ్యాణ్… ఇప్పుడున్న రాజకీయ నాయకులలాగా అందరిలాంటివాడేనా? లేక కేవలం విధానాలు, లక్ష్యాలు, ఆశయాల గురించి చెప్పి, వాటిని తాను ఎలా సాధించగలడో ప్రజలకు వివరించి కులాల, మతాల ప్రస్తావన లేకుండా ప్రజలందరికీ దగ్గరయ్యి అందరివాడు అని అనిపించుకునేంత సత్తా ఉన్న నాయకుడా?

ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను పరిశీలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా అందరిలాంటివాడే అని కచ్చితంగా చెప్పొచ్చు. తిరుపతి సభలో కూడా ‘నేను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతం’ అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు పవన్. అదే వేదిక పై నుంచే వినోద్ తల్లి గురించి చాలా గొప్పగా మాట్లాడి….ఆ తర్వాత ఆమె ‘తిరుపతి మహిళ’ అని తిరుపతి ప్రాంతానికి మాత్రమే ఏదో ప్రత్యేకత ఉంది అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. నిజానికి మన కంఫర్ట్స్ కోసం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో పేరు పెట్టుకున్నాం. కానీ మన నాయకులు మాత్రం నేను లోకల్ అని చెప్పుకోవడానికి, లేకపోతే ఆ ప్రాంతం ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఆయా ప్రాంతాలకు ప్రత్యకేతలు ఆపాదిస్తూ ఉంటారు. సినిమా వాళ్ళు, రచయితలు కూడా సేం టు సేం. వాళ్ళు నివసించే ప్రాంతంపైన ప్రజలకు బోలెడంత దురభిమానం క్రియేట్ అయ్యేలా చేస్తూ ఉంటారు. ఎవరి స్వార్థం వాళ్ళది. నిజానికి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రకాల మనుషులూ ఉంటారు. ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని మనుషులను గుర్తించడం అనేది హర్షించదగ్గ విషయమైతే కాదు. కానీ మన నాయకులకు మాత్రం ప్రాంతాల గొడవలు కావాలి. ప్రజల మధ్య విభజన రేఖలను పెంచుతూ పోవాలి. అప్పుడే సంఘటితంగా నాయకులను ప్రశ్నించే పరిస్థితి రాకుండా ఉంటుంది.

జనసేన ఆవిర్భావ సభలో నా తెలంగాణ మిత్రుడు అని శరత్ మరార్ పేరు చెప్పిన పవన్….ఆ తర్వాత ‘నా తెలంగాణా మిత్రుడు, ఆంధ్రా మిత్రుడు అని చెప్పుకుంటామా?’ అని అన్న పవన్….అలా చెప్పుకోవాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారని ‘ఆవేధన’ వ్యక్తం చేశాడు. కానీ తిరుపతి సభలో మాత్రం ‘నా క్రిష్టియన్ భార్య’ అని చెప్పుకొచ్చాడు. వివాహం, భార్యలు….లాంటి విషయాలు వ్యక్తిగతమైనవని చెప్పాడు జనసేన ఆవిర్భావ సభలో చెప్పాడు పవన్. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం భావ్యం కాదన్నట్టుగా మాట్లాడాడు. మరి పబ్లిక్‌గా తన వ్యక్తిగత విషయాల గురించి ఎలా మాట్లాడేశాడు. ‘మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు’ అని పవన్ గురించి మాట్లాడితే… అది పవన్ ఇమేజ్‌కి భంగం కలిగిస్తుంది కాబట్టి వ్యక్తిగత విషయం అయిపోయింది. ‘హిందువు అయిన పవన్ ఓ క్రిష్టియన్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కూతురుని కూడా క్రిష్టియన్ పద్దతులలో పెంచుతున్నాడు….’ అని పవన్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటే …అది తన ఇమేజ్‌ని పెంచుతుందని పవన్ అనుకుంటున్నాడు కాబట్టి ….తన గొప్పతనం గుర్తించమని, తన గొప్పతనం గురించి మాట్లాడమని, ఆయనే తన వ్యక్తిగత విషయాలు చెప్పేస్తున్నాడన్నమాట. ఇలా అయితే ఎలా అబ్బా? ఫక్తు రాజకీయనాయకుడి లక్షణమబ్బా ఇది. రెండు నాలుకల సిద్ధాంతాన్ని ఇంత త్వరగా పట్టేశావా?

ఆంధ్రప్రదేశ్‌‌లో కుల రాజకీయాల గురించి మాట్లాడుకుంటే.. అధికార పక్షం, ప్రతిపక్షాలు చెరో కులపు ఓటర్లను గాటన కట్టేసుకుని ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన సొంత కులాల ప్రజల గురించి, ఆ కుల ప్రజల ప్రయోజనాల గురించి ఇద్దరు నాయకులు కూడా అస్సలు మాట్లాడరు. అలాగే ప్రత్యర్థి నాయకుడి కులం ప్రజల ప్రస్తావన కూడా పెద్దగా తీసుకురారు. మిగతా అన్ని కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సిఎం, ప్రతిపక్షనేతలిద్దరూ కూడా చేతల్లో అన్ని ప్రయోజనాలనూ కల్పిస్తుంది ఆ రెండు కులాలకే కాబట్టి. ఇప్పుడు పవన్ కూడా సేం టు సేం అన్నమాట. ఆయన కులం గురించి పబ్లిక్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మిగిలిన క్రిష్టియన్స్, మైనారిటీస్, వెనుక బడిన కులాలు…ఓటర్ల లిస్టులో ఎన్ని కులాల, మతాల పేర్లు ఉంటాయో అన్నింటి గురించి మాట్లాడేస్తాడన్నమాట. ప్రస్తుతానికి క్రిష్టియన్ ప్రజలు తనకు ఎందుకు ఓటేయాలి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు పవన్. ఎన్నికల్లోపు ఇంకా చాలా సభలలో మాట్లాడతాడు కాబట్టి….ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ సెటైర్‌ని నిజం చేస్తూ మిగతా కులాల, మతాల ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి కూడా తన వ్యక్తిగత జీవితపు హిస్టరీని వాడతాడేమో చూడాలి? లేక రిజర్వేషన్స్ తాయిలాలు, హామీల వర్షాలు కురిపిస్తాడేమో చూడాలి.

తన సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించి, తన సమర్థత గురించి ప్రజలు అర్థం చేసుకునేలా చేసి… వాళ్ళ మెప్పుపొందాలన్న ప్రయత్నమైతే పవన్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. మడమ తిప్పను…మాట తప్పను, నా ఇంట్లోనే బోలెడు మతాలున్నాయి లాంటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం నాటి రాజకీయాన్నే ఫాలో అవుతున్నాడు. అందరు నాయకుల్లాగే ఆవేశం పాళ్ళు ఎక్కువుండే యువతకు గాలం వేయడానికి కూడా మరీ రొటీన్ డైలాగులు పేలుస్తున్నాడు పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ మంది మాత్రం ప్రస్తుతం మరో చంద్రబాబు, జగన్ లాంటి నాయకుడిని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేరు. చిరంజీవి రాజకీయల్లో విఫలమవడానికి కూడా కారణమదే.

‘అందరూ అదే చేస్తున్నారు కదా…మా నాయకుడి గురించే ఎందుకు ఎక్కువ విమర్శిస్తున్నారు…?’ అని చిరంజీవి విషయంలోనూ అభిమానులు బాధపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ బాధపడుతున్నారు. విశ్లేషకులు కూడా అప్పుడు అన్న చిరంజీవి విషయంలో చెప్పింది, ఇప్పుడు తమ్ముడు పవన్ విషయంలో చెప్తోంది అదే. పవన్ కూడా అందరు నాయకుల్లాంటివాడే…..అందరివాడు అయితే కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close