జల జగడానికి ఫుల్ స్టాప్ పెడతారా?

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య రావణకాష్టంలా రగులుతున్న జల జగడానికి ముగింపు పలకడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరపడానికి కేంద్ర మంద్రి ఉమాభారతి నిర్ణయించారు. ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఏపీ అభ్యంతరం చెప్తోంది. ఇది విభజన చట్టానికి విరుద్ధమని వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వాటా నీటిని ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్తోంది. ఏపీ వాటా వీటిని తాము వాడుకునేది లేదంటోంది.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమతమ వాదనలను వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిల్లో ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యకు ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు నీటికేటాయింపులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, విభజన చట్టంలోని నిబంధనలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రభుత్వ వాదనలో నిజమెంత అనేది మొదట కేంద్ర మంత్రి ఆరా తీయవచ్చు. ప్రాజెక్టుల ప్రతిపాదిక ఆయకట్టు, నీటి వినయోగంపైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ను వివరణ కోరుతారు. ఆ తర్వాత ఏపీ వాదనలో నిజమెంత అనేది కూడా పరిశీలిస్తారు. తమ అభ్యంతరాలు ఏమిటనేది చంద్రబాబు సవివరంగానే చెప్తారు. అప్పుడు ఎవరి వాదన సరైంది, ఏ ప్రాజెక్టు చట్ట వ్యతిరేమైంది అనేదానిపై కేంద్రం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

ఇది చాలా సున్నితమైన అంశం. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు, నిధుల కోసం అంటోంది కేసీఆర్ ప్రభుత్వం. అయినంత మాత్రాన విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వాస్తవిక అంశాలతో పాటు భావోద్వేగాలు ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close