చిరంజీవి 150వ సినిమా.. ఖైదీ నెం150 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది చిత్రబృందం ఆలోచన. ఎందుకే…. నాన్ స్టాప్ గా షూటింగ్ సాగుతోంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం తమన్నా పేరు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఐటెమ్ పాట కోసం తమన్నానీ సంప్రదించింది చిత్రబృందం. అయితే ఇప్పుడు ఏమైందో… ఆ అవకాశం కేథరిన్కి వెళ్లిపోయింది. సరైనోడులో అల్లు అర్జున్తో జోడీ కట్టింది కేథరిన్. ఇప్పుడు చిరుతో చిందేసే ఛాన్స్ అందుకొంది. తమన్నా ఒక్క పాటకు రూ. 50 లక్షల వరకూ డిమాండ్ చేయడంతో.. కేథరిన్ వైపు దృష్టి సారించింది చిత్రబృందం. కేథరిన్ పాత్రని పాటకే పరిమితం చేయలేదు. ఒకట్రెండు సన్నివేశాలు కూడా సృష్టించార్ట. దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ఈ సినిమా కోసం అదిరిపోయే ఐటెమ్ గీతాన్ని సెట్ చేశాడట. ఆ పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యిందని, ఐటెమ్ గీతాల్లో ఇదో సరికొత్త ట్రెండ్ సృష్టించే పాట అవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ నిర్మాత. ఓ పాటలో ఈ మెగా తనయుడు కూడా కనిపించే అవకాశాలున్నాయి.