రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కథానాయికగా ఎంట్రీ ఇస్తోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారాహి సంస్థ నాగ శౌర్య తో ఓ సినిమా చేస్తోందని, అందులో శివాని హీరోయిన్ గా పరిచయం కాబోతొందని చెప్పుకున్నారు. దీని పై రాజశేఖర్ స్పందించారు. శివాని హీరోయిన్ అవుతొందన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. శివానిని హీరోయిన్ గా చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, భవిషత్తులో చెప్పలేమన్నారు. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తామని క్లారిటీ ఇచ్చారు. శివాని తో ఇదివరకు వందకు వంద అనే సినిమా పట్టాలు ఎక్కించారు. ఆ సినిమా ఏమయ్యిందో ఇంతవరకు తెలీదు. ఈ సారి మాత్రం పక్కా ప్లాన్ తో శివాని ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారట. ఓ పేరున్న సంస్థ చేతిలో శివానిని పెట్టి.. వెనుకనుంచి తాము పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్టు టాక్. మరో వైపు రాజశేఖర్ కూడా నటుడిగా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో ఓ సినిమా త్వరలో మొదలుకానుంది.