అది కూడా హైకోర్టే చెప్పాలా సార్!?

తెలంగాణలో స్మార్ట్ పోలీసింగ్ అని ప్రభుత్వం తరచూ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. పీపుల్ ఫ్రెండ్లీ అని పొగుడుతూ ఉంటుంది. కానీ ఆ శాఖలోనే ఓ ఎస్ ఐ ఆత్మ హత్య చేసుకున్న తర్వాత మాత్రం ప్రభుత్వం వారి పోలీసు శాఖ కనీస మానవత్వాన్ని ప్రదర్శించలేదు.కనీసం రూల్స్ ప్రకారం డ్యూటీ చేయలేదు. సున్నితమైన విషయాల్లో సత్వరం స్పందించాల్సిన ముఖ్యమంత్రి గానీ, హోం మంత్రి గానీ ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలులేవు.

మెదక్ జిల్లా కుకునూర్ పల్లి ఎస్ ఐ రామకృష్ణారెడ్డి గత నెల 17న ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే తనువు చాలిస్తున్నానని ఆయన ఆత్మహత్యకు ముందు లేఖ రాశారు. సూసైడ్ నోట్ లో పేర్కొన్న అధికారులపై ఎఫ్ ఐ ఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

తన భర్త ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలున్న అధికారులపై కేసు నమోదు చేయకపోవడంపై రామకృష్ణా రెడ్డి భార్య ధనలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గౌడ్, తొగుట సీఐ రామాంజనేయులు, సిద్దిపేట రూరల్ సీఐ వెంకటయ్య తదితరులు తన భర్త బలవన్మరణానికి కారకులని ఆమె పేర్కొన్నారు. సూసైడ్ నోట్ లో పేరున్న అధికారులపై ఎందుకు కేసు నమోదు చేయలేదో తెలపాలంటూ కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉంది. అయినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోక పోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం చిన్న విషయం కాదు. అందులోనూ తమ శాకలోనే ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది.

పోలీసులకు ఆధునిక సౌకర్యాలు ఇచ్చామని చెప్పుకోవడమే గానీ, వాళ్లు ఎలా పనిచేస్తున్నారనేది ప్రభుత్వం పట్టించుకుంటున్నదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంత సున్నితమైన విషయాన్ని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పట్టించుకోక పోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొన్ని సందర్భాల్లోచిన్న చిన్న విషయాలకు స్పందించే ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంత సీరియస్ విషయాన్ని విస్మరించారా, లేక హోం మంత్రి చూసుకుంటారని వేరే విషయాల మీద దృష్టి పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి, హైకోర్టు ఆదేశాల తర్వాత ఈ కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగవచ్చనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. ఒకవేళ, పోలీసులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తే న్యాయ వ్యస్థను నమ్ముకోవడమే మార్గం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close