బాబూ బంగారం మూడ్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలనుకుంటున్నాడు వెంకటేష్. అందుకే సలా ఖదూస్ రీమేక్ పనులు మొదలెట్టేశాడు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి గురు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఫస్ట్ లుక్ కూడా దానికి అనుగుణంగానే డిజైన్ చేశారు. బాక్సింగ్ గ్లవుజులతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నాడు వెంకీ. లుక్ పరంగా కొత్తదనం ఏమీ లేదు. మాతృకలో మాధవన్ ని ఫాలో అయిపోయాడు వెంకీ. కాకపోతే అక్కడ మాధవన్ చింపిరి జుట్టుతో కనిపిస్తే ఇక్కడ వెంకీ కాప్ పెట్టుకున్నాడు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన సాలా ఖదూస్.. తమిళం లో ఓ మాదిరిగా ఆడింది. అయినా ఆ కథపై మక్కువతో వెంకటేష్ ఈ రీమేక్ కి ఒప్పుకున్నాడు. గెటప్ లో పెద్దగా మార్పులు లేకపోయినా… కథలో మాత్రం మార్పులు కనిపిస్తాయట. తమిళ, హిందీ భాషల్లో కనిపించిన రితికా సింగ్.. గురులోనూ నటిస్తోంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు టాక్.